ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి యూఏఈ అధ్యక్షుడి ఫోన్ కాల్
ప్రధానమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ అధ్యక్షుడు
భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లటంపై చర్చించిన నేతలు
బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ విజయవంతంగా నిర్వహించటం పట్ల ప్రధానమంత్రికి యూఏఈ అధ్యక్షుడి అభినందనలు
పశ్చిమాసియాలో శాంతి, భద్రతలు, స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు నిబద్ధతను తెలిపిన నేతలు
నాడు పోస్టు చేయడమైనది:
18 SEP 2026 4:32PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు గౌరవ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్ ఫోన్ కాల్ చేశారు.
ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇరుదేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచేందుకు ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం వంటి రంగాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి ఇరువురు నేతలు చర్చించారు.
బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ విజయవంతంగా నిర్వహించటం పట్ల ప్రధానమంత్రికి యూఏఈ అధ్యక్షుడు అభినందనలు తెలిపారు. బ్రిక్స్ సమావేశంలో గౌరవ యువరాజు షేక్ ఖాలీద్ పాల్గొనటం పట్ల, భారతదేశ అధ్యక్షతన సార్థకమైన ఫలితాలను సాధించటంలో యూఏఈ సహకారం, భాగస్వామ్యం పట్ల ప్రధానమంత్రి ప్రశంసించారు.
పశ్చిమాసియా పరిణామాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాల్లో నిరంతర సహకారాన్ని, సమన్వయాన్ని కొనసాగించేందుకు నిబద్ధతను తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2312143)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14