ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌కు కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 SEP 2026 10:33PM by PIB Hyderabad

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ భారతీయుడికి ముఖ్యంగా ఎంతోకాలంగా అట్టడుగున ఉండిపోయిన వారికి గౌరవాన్ని, అవకాశాలను, సాధికారతను అందించేలా నిరంతరం కృషి చేస్తున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

రామ్‌నాథ్ కోవింద్‌ జీ అందించిన శుభాకాంక్షలు, ఆలోచనాత్మకమైన మాటలకు ధన్యవాదాలు.

ప్రతీ భారతీయుడికి ముఖ్యంగా ఎంతోకాలంగా అట్టడుగున ఉండిపోయిన వారికి ఆత్మగౌరవాన్ని, అవకాశాలను, సాధికారతను కల్పించే దిశగా నిరంతరం కృషి జరుగుతోంది.

పటిష్టమైన, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి మరింత అంకితభావంతో కలిసికట్టుగా పనిచేయటమే మనందరి ఉమ్మడి సంకల్పం.


(రిలీజ్ ఐడి: 2311952) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam