ప్రధాన మంత్రి కార్యాలయం
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2026 8:09PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్‌కు కృతజ్ఞతలు ప్రకటించారు. సామాన్యులకు సేవ చేయడం తన దృఢ సంకల్పమని, అందుకోసం ఏ చిన్న అవకాశం లభించినా జారవిడవబోనని శ్రీ మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“హరివంశ్ గారూ, నాకు జన్మదిన శుభాకాంక్షలకు తెలిపినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజా సేవ దిశగా నా దృఢ సంకల్పం ఎట్టి పరిస్థితుల్లోనూ సడలిపోదు. దేశ ప్రజలకు అన్ని విధాలా సాధికారత కల్పించే దిశగా ఏ చిన్న అవకాశం వచ్చినా నేనెన్నడూ జారవిడవబోను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2311775)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9