హోం మంత్రిత్వ శాఖ
ఉపా చట్టం కింద షహజాద్ భట్టి వ్యవస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా చర్యలు
సరిహద్దుల మీదుగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు యువత, చిన్న చిన్న నేరస్థులను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్న షహజాద్ భట్టి వ్యవస్థ
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, మత సామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా విద్వేషపూరిత డిజిటల్ కంటెంట్‌ను ప్రచురించిన సంస్థ
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 7:44PM by PIB Hyderabad
ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించకూడదన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా.. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద షహజాద్ భట్టి వ్యవస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా నేడు వెల్లడించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో.. ‘‘ఉగ్రవాదంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానానికి అనుగుణంగా, ఉపా చట్టం కింద షహజాద్ భట్టి వ్యవస్థను ఉగ్రవాద సంస్థగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది.
ఈ సంస్థ సరిహద్దుల మీదుగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడంతో పాటు, యువత, చిన్న చిన్న నేరాలకు పాల్పడే వ్యక్తులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తోంది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, మత సామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ముఠా విద్వేషపూరిత డిజిటల్ కంటెంట్‌ను కూడా వ్యాప్తి చేస్తోంది” అని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2311157)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11