ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా కప్ హాకీ విజేత భారత జూనియర్ పురుషుల జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
13 SEP 2026 8:41PM by PIB Hyderabad
ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. దక్షిణ కొరియాతో తుది పోరులో 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించడం ఎంతో ఆనందదాయకమని ఆయన కొనియాడారు.
భారత హాకీకి ఇదొక అద్భుత ఘనత కాగా, యువ క్రీడాకారుల అసమాన ప్రతిభకు ఈ విజయం నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తిరుగులేని క్రీడా పాటవంతో విజయపథాన సాగిన జట్టు మొత్తానికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా కప్ జూనియర్ హాకీ ఫైనల్‌లో 4-1 తేడాతో ఘన విజయం ద్వారా ట్రోఫీ గెలుచుకున్న మన పురుషుల హాకీ జట్టుకు అభినందనలు. నిజంగా ఈ విజయం ఒక అద్భుత ఘనత… మన యువ క్రీడాకారుల అసమాన ప్రతిభకు నిదర్శనం. జట్టు మొత్తానికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2310223)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam