ప్రధాన మంత్రి కార్యాలయం
‘సమ్మిళిత ప్రపంచ పాలన, బహుపాక్షిక విధానాన్ని బలోపేతం చేయడం’’ అనే అంశంపై జరిగిన బ్రిక్స్ సమావేశానికి ప్రధాని అధ్యక్షత
నాడు పోస్టు చేయడమైనది:
13 SEP 2026 10:48AM by PIB Hyderabad
1. న్యూఢిల్లీలో కొనసాగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా సెప్టెంబర్ 12,2026న ‘‘సమ్మిళిత ప్రపంచ పాలన, బహుపాక్షిక విధానాన్ని బలోపేతం చేయడం’’ అనే అంశంపై జరిగిన సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
2. తన ప్రసంగంలో ప్రధానమంత్రి ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలు:
I. ప్రపంచ సంక్షోభాల సమయంలో గ్లోబల్ సౌత్ ముందు వరుసలో ఉంది. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం వెనుక వరుసలో ఉంది. ఈ ‘‘విశేషాధికారాల పిరమిడ్’’ను ‘‘భాగస్వామ్య వేదిక’’గా మనం మార్చాలి.
II. ప్రస్తుత వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లాంటి సంస్థలకు విస్తృత ప్రాతినిధ్యం ఉండేలా ప్రపంచ పాలన ఉండాలి.
III. నియమాలను పాటించే స్థాయి నుంచి వాటిని రూపొందించే స్థాయికి గ్లోబల్ సౌత్‌ను మార్చేలా ప్రయత్నాలు చేయాలి. బ్రిక్స్ ద్వారా నైపుణ్యాలు, ఆచరణాత్మక శిక్షణ, న్యాయ నైపుణ్యాలను గ్లోబల్ సౌత్‌కు చెందిన యువ దౌత్యవేత్తలకు, విధాన రూపకర్తలకు అందించాలి.
IV. ప్రపంచ వాణిజ్యానికి నావికులు గణనీయమైన తోడ్పాటును అందిస్తున్నారు. అయినప్పటికీ సంక్షోభాల సమయంలో వారికి తగిన సహాయం లభించడం లేదు. అందుకే నావికుల అత్యవసర సహాయక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
3. మన భవిష్యత్తు ఉమ్మడిది. కాబట్టి గళం నుంచి ప్రభావం వరకు, ప్రత్యేకాధికారం నుంచి భాగస్వామ్యం వరకు ఆ భవిష్యత్తును తీర్చిదిద్దే హక్కు కూడా ఉమ్మడిగానే ఉండాలంటూ పీఎం తన ప్రసంగాన్ని ముగించారు. ప్రధాని ప్రారంభోపన్యాసాన్ని ఇక్కడ చూడొచ్చు.
4. భవిష్యత్తులో బ్రిక్స్ సహకారానికి సంబంధించిన ఉమ్మడి ప్రాధాన్యాలు, నిబద్ధత, దిశను నిర్దేశించే న్యూఢిల్లీ బ్రిక్స్ లీడర్స్ ప్రకటనను ఆమోదించడంతో సమావేశం ముగిసింది. ప్రకటనను ఇక్కడ చూడొచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2309906)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
Kannada
,
Assamese
,
Tamil
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Malayalam