రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్రపతితో ఇరాన్ అధ్యక్షుని సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
12 SEP 2026 4:35PM by PIB Hyderabad
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూర్ పెజెష్కియాన్ ఈరోజు ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు.
భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు రాష్ట్రపతి సాదర స్వాగతం పలికారు. భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఇరాన్ అందించిన సహకారాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు.
ఇరాన్, భారత్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలతో పాటు బలమైన సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొల్పేందుకు భారత్ కట్టుబడి ఉందని రాష్ట్రపతి పునరుద్ఘాటించారు. విభేదాలను, ఘర్షణలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని రాష్ట్రపతి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2309598)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9