ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పీఎం నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి రోష్ హషానా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 12 SEP 2026 2:31PM by PIB Hyderabad

రోష్ హషానా (యూదు నూతన సంవత్సర వేడుక) సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూకు, ఇజ్రాయెల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ కొత్త సంవత్సరం అందరికీ శాంతి, ఆశ, మంచి ఆరోగ్యం, నిరంతర ప్రగతిని తీసుకురావాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు

 

 ‘‘షానా తోవా..

 

ప్రధానమంత్రి నెతన్యాహూకు, ఇజ్రాయెల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజాలకు రోష్ హషానా సందర్భంగా శుభాకాంక్షలు.

 

ఈ కొత్త సంవత్సరం అందరికీ శాంతి, ఆశ, మంచి ఆరోగ్యం, నిరంతర ప్రగతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను”


(రిలీజ్ ఐడి: 2309595) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam