వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రతిపాదిత విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు నేతలతో శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ చర్చలు


సాగుకు సంబంధించిన ప్రతి విధానాన్నీ రైతులతో చర్చలు, సంప్రదింపుల తరువాతే నిర్ణయించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్

1966 నాటి చట్టం ఈ కాలపు సవాళ్లను పరిష్కరించలేదు

చట్ట పరిధికి వెలుపల 70 శాతం విత్తనాలు

నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్

రైతుల హక్కులకు పూర్తి రక్షణ

సాంప్రదాయిక విత్తనాలతో పాటు రైతులు రూపొందించిన విత్తన రకాలపై ఆంక్షలుండవు: శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్

నకిలీ విత్తనాల వాణిజ్యాన్ని అరికట్టడానికి భారీ జరిమానాలు, జైలు శిక్ష కూడా విధించే ప్రతిపాదనలు: శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్

తప్పనిసరిగా పేర్ల నమోదు ప్రక్రియ, క్యూఆర్ కోడ్స్ ద్వారా విత్తనాల రాకపోకల క్రమబద్ధీకరణ...: శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్

కొత్త విత్తనాలను తరచుగా విడుదల చేసేందుకు రాష్ట్రాలకు అధికారాలు: శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్

రైతులకు 15 రోజుల లోపల పరిహారం..

ప్రతి రాష్ట్రంలో ‘విత్తన భద్రతా నిధి’ ప్రతిపాదన: శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్

నాడు పోస్టు చేయడమైనది: 10 SEP 2026 8:55PM by PIB Hyderabad

నకిలీనాసిరకం విత్తనాల వలలో చిక్కుకోకుండా రైతులను రక్షించడానికి ఒక బలమైన విత్తన చట్టాన్ని తీసుకువచ్చే దిశగా  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందిదేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన రైతు సంఘాల నాయకులతో కేంద్ర వ్యవసాయరైతు సంక్షేమగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీ.. కృషి భవన్లో ఈ రోజు సంప్రదింపులు జరిపారుఈ సంప్రదింపుల్లో దాదాపు అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని ప్రతిపాదిత చట్టం విషయమై సూచనలు చేశారుసుమారు 20 రైతు సంఘాలు తమ ఆలోచనలను వ్యక్తం చేశాయిఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ కార్యదర్శి శ్రీ ఆతిశ్ చంద్రతో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

సంప్రదింపుల్లో భారతీయ కిసాన్ సంఘ్భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన వివిధ వర్గాలుఆలిండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేసీసీ), కిసాన్ మహాపంచాయత్భారతీయ కృషక్ సమాజ్గావ్ కిసాన్ ఉన్నయన్సొసైటీ ఫర్ ఇండిపెండెంట్ ఫార్మర్స్ అసోసియేషన్ (ఎస్ఐఎఫ్ఏ), కర్ణాటక రాజ్య రైత సంఘతెలంగాణ రైతు సంఘంమహారాష్ట్రకు చెందిన షేత్కారీ సంస్థలుగుజరాత్‌కు చెందిన ఖేదుత్ సమాజ్తమిళనాడుకు చెందిన వివసాయిగళ్ సంగమ్జార్ఖండ్‌కు చెందిన ప్రగతిశీల్ కృషి మంచ్కేరళ.. కొట్టాయం‌కు చెందిన ఒక రైతుల సంస్థతదితర సంఘాలు ఉన్నాయి.

ప్రస్తుత 1966 చట్టానికి సవరణలు అవసరం

ఇప్పుడున్న విత్తన చట్టాన్ని 1966లో రూపొందించారనీవిత్తన నియంత్రణ ఉత్తర్వును 1983లో అమల్లోకి తీసుకువచ్చినట్లు శ్రీ చౌహాన్ తెలిపారుగత ఆరు దశాబ్దాల్లో వ్యవసాయంలో చెప్పుకోదగిన మార్పులు వచ్చాయనీనకిలీ విత్తనాలునాసిరకం విత్తనాల అమ్మకంజవాబుదారుతనం లోపించడం వంటి సరికొత్త సవాళ్లను ప్రస్తుత చట్టం పరిష్కరించ జాలదనీ ఆయన అన్నారు. ‘వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్’ సందర్భంగా కొత్త విత్తనాలుపురుగుమందుల అవసరాన్ని రైతులు చాటిచెప్పారని ఆయన గుర్తుచేశారువిత్తన చట్టం ముసాయిదా పై సూచనలనుసలహాలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం  2025 నవంబరుడిసెంబరులలో కోరగా రైతులురైతు సంఘాల వద్ద నుంచి దాదాపు 18,000 సూచనలు అందాయన్నారురైతులతో  కలిసి పనిచేసే సంస్థల వద్ద నుంచి నేరుగా సూచనలను అందుకోవడానికి సంప్రదింపుల ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారుచట్టాన్ని ఖరారు చేయడానికి తొందర పడబోరనీఎలాంటి తుది గడువునూ అనుకోలేదనీ శ్రీ చౌహాన్ చెప్పారుప్రభుత్వం ముందుకు పోయే లోపు రైతులురైతు సంఘాలుఇతర ఆసక్తిదారు వర్గాల నుంచి సూచనలను పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు.

చట్ట పరిధికి వెలుపలే 70 శాతం విత్తనాలు

విత్తనాల్లో 70 శాతం వరకూ ప్రస్తుత విత్తనాల చట్టం పరిధికి వెలుపల ఉన్నాయనివిత్తనాలకు సంబంధించిన ప్రక్రియలు రాష్ట్రం వారీగా వేర్వేరుగా ఉన్నాయనీఇప్పుడున్న శిక్షాత్మక నిబంధనలు సరిపోవడంలేదనీ శ్రీ చౌహాన్ వివరించారుఈ నేపథ్యంలో నకిలీఅప్రామాణిక విత్తనాలకు వ్యతిరేకంగా బలమైనఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉండేఒకే విధమైన నియంత్రణతో కూడిన ప్రాథమిక ప్రణాళికను తీసుకురావడానికి ఒక కొత్త చట్టాన్ని రూపొందించవలసి ఉందని ఆయన అన్నారు.

రైతుల సాంప్రదాయిక విత్తన హక్కుల పరిరక్షణ

ప్రతిపాదిత చట్టం రైతులకు ఇప్పుడున్న హక్కులను పరిమితం చేయబోదని మంత్రి స్పష్టం చేశారురైతులు తమ సాంప్రదాయికదేశవాళీ రకం విత్తనాలను ఉపయోగించడంఇచ్చి పుచ్చుకోవడంవిక్రయించడంలో ఇదివరకటి మాదిరి స్వతంత్రులుగానే ఉంటారని ఆయన తెలిపారుసాంప్రదాయిక విత్తనాలకు నమోదు తప్పనిసరి కాదన్నారురైతులు కోరుకుంటే తమ విత్తన రకాలకు నమోదు చేయొచ్చని ఆయన తెలిపారుసొంత వినియోగంగ్రామాల్లో పంపిణీలేదా ఏదైనా కంపెనీ కోసం విత్తనాలను ఉత్పత్తి చేసే రైతులు ఈ నిబంధనల్లో భాగంగా డిజిటల్ నమోదు చేయించాల్సిన పని లేదన్నారు.

తీవ్ర నేరాలకు రూ.30 లక్షల వరకూ జరిమానాఅదనంగా జైలు శిక్ష

ప్రతిపాదిత చట్టం నేరాలను మూడు శ్రేణులుగా వర్గీకరిస్తుంది:

అల్ప అతిక్రమణలు: మొదటి సారి నేరానికి పాల్పడితే హెచ్చరిక చేస్తారురెండో సారి నేరం చేస్తే రూ.50,000 వరకు జరిమానాను విధిస్తారు.

ఉద్దేశపూర్వక అతిక్రమణలు: ఒక క్యూఆర్ కోడ్‌ను అంటించకపోతేఅవసరమైన సమాచారాన్ని ఇవ్వకపోతేలేదా తప్పుడు బ్రాండింగుకు ఒడిగట్టడం వంటి నేరాలకు తొలి ఉల్లంఘనకు రూ.1 లక్షమలి ఉల్లంఘనకు రూ.2 లక్షల జరిమానాను విధిస్తారు.

తీవ్ర నేరాలుఈ కేటగిరీలో నకిలీ విత్తనాల అమ్మకంనమోదు చేసుకోకుండానే వాణిజ్యాన్ని నిర్వహించడం లేదా కావాలనే మోసానికి పాల్పడడం వంటి నేరాలకు జైలు శిక్షతో పాటు రూ.30 లక్షల వరకు జరిమానాను విధిస్తారు.

చట్టవిరుద్ధ విత్తన వ్యాపారాన్ని నిరోధించేందుకు ఈ కఠిన నియమ నిబంధనలు ఉపయోగపడతాయని శ్రీ చౌహాన్ అన్నారు.

100 శాతం నమోదుక్యూఆర్-ఆధారిత ట్రేసబులిటీ

ప్రతిపాదిత చట్టంలో భాగంగా అన్ని రకాల విత్తనాలనీవ్యవసాయ సామగ్రినీ జాతీయ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయించాల్సి ఉంటుందివిత్తనాలను నమోదు చేయకపోడాన్ని చట్టవిరుద్ధంగా భావిస్తారుబహిరంగ మార్కెట్లో విక్రయించడం కూడా నేరమే అవుతుందిప్రతి ఒక్క విత్తన ప్యాకెట్టుకూ క్యూఆర్ కోడ్ ఉంటుందిదీనివల్ల రైతులు మూలాన్నితయారీదారునీప్రయోగశాల అనుమతినీసరఫరా మార్గానికి సంబంధించిన సమాచారాన్నీ తెలుసుకోగలుగుతారునకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయిన సందర్భంలో బాధ్యులను గుర్తించడం కష్టమవుతోందినకిలీల నివారణను కొత్త చట్టం అరికడుతుందినేరగాళ్లను గుర్తించే దిశగా పటిష్ఠ వ్యవస్థను ఏర్పరుస్తుంది.

కొత్త రకాలను విడుదల చేయడానికి రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు

రాష్ట్ర స్థాయి సంఘాల సిఫార్సు చేసిన మీదట కొత్త విత్తన రకాలను విడుదల చేసే అధికారాలను ప్రతిపాదిత చట్టం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుందిజాతీయ ప్రమాణాలు కూడా అమల్లో ఉంటాయిస్థానిక వాతావరణంప్రాంతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరింత ప్రభావవంతమైన రకాలను రాష్ట్రాలు విడుదల చేయగలుగుతాయి.  అన్ని రకాల విత్తనాల జాబితాను ఆన్ లైనులో నమోదు చేస్తారుఈ జాబితా కేంద్రరాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అందుబాటులో ఉంటుంది.

విత్తన భద్రత నిధి’.. 15 రోజుల్లోపల పరిహారం

రైతుల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని... రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో ఒక విత్తన భద్రతా నిధిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉందిజరిమానాలువిత్తన చట్టం ప్రకారం వసూలు చేసిన నగదును ఈ నిధుల్లో జమ చేస్తారువిత్తనం విఫలమైనారైతు నష్టపోయినా సమీక్షాసంఘం 15 రోజుల లోపల పరిహారం అందేటట్లు చూస్తుందిరైతులకు వినియోగదారు పరిరక్షణ చట్టం కింద పరిహారాన్ని కోరే హక్కు కూడా ఉంటుంది.

ఇక ముందూ రైతులతో సంప్రదింపులు

అనుభవాలను పంచుకోవడంతో పాటు సలహాలు ఇచ్చినందుకు శ్రీ చౌహాన్... రైతు సంఘాల నేతలకు ధన్యవాదాలు తెలిపారురైతు సంఘాలు అందించిన సూచనలను పరిశీలిస్తామని ఆయన తెలిపారుఆచరణీయ సూచనలను తుది ముసాయిదాలో చేర్చే అవకాశం ఉంటుందని తెలిపారు.  రైతుల ప్రయోజనాలను ప్రధానంగా లెక్కలోకి తీసుకొనివారితో సంప్రదింపులుచర్చలు జరుపుతూ విధానాలను ఖరారు చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ చౌహాన్ మరోసారి స్పష్టం చేశారునకిలీనాసి రకం విత్తనాల వలలో రైతులు చిక్కుకోకుండా వారిని కాపాడుతూ పటిష్ఠమైనజవాబుదారుతనంతో కూడిన విత్తన నియంత్రణ వ్యవస్థను నెలకొల్పే దిశగా ప్రస్తుతం జరుపుతున్న సంప్రదింపులు ముఖ్యపాత్రను పోషిస్తాయని

ఆయన అన్నారు.  ఇతర ఆసక్తిదారు వర్గాలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయనీఈ ప్రక్రియ అంతటికీ రైతుల హితమే ప్రధానంగా ఉంటుందనీ ఆయన తెలిపారురైతులకు సౌభాగ్యాన్నీసాధికారతనీఆత్మనిర్భరతనీ సమకూర్చాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో ప్రతిపాదిత చట్టం ఒక భాగమని శ్రీ చౌహాన్ వర్ణించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2309376) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Kannada