ప్రధాన మంత్రి కార్యాలయం
ఉగ్రవాదంతో రాజీలేని పోరు... 9/11 దాడుల బాధితులను స్మరించుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
11 SEP 2026 11:48AM by PIB Hyderabad
సరిగ్గా 25 ఏళ్ల కిందట 9/11 దుర్ఘటనలో చనిపోయిన బాధితులను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుందని, సరిహద్దు తీవ్రవాదంతో నష్టపోతున్న భారతదేశం... దశాబ్దాలుగా పోరాడుతూ, ఉగ్రవాదంపై జరిగే పోరులో అగ్రభాగాన ఉందన్నారు.
ఉగ్రవాదం ఎప్పటికప్పుడు రూపాన్ని మార్చుకుంటున్నదని, ఏ రూపంలో ఉన్నా దానిని అంతం చేసే వరకూ భారతదేశపు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ దిశగా జరిగే ప్రతి ప్రయత్నానికీ తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు.
2014లో 9/11 స్మారకాన్నీ, మ్యూజియంనూ తాను సందర్శించినప్పటి ముఖ్యాంశాలను ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు
:
‘‘9/11 దాడులు జరిగి ఇప్పటికి 25 ఏళ్లు. బాధితులకు నివాళులు అర్పిస్తున్నాను. అనూహ్య మార్పులకు గురైన బాధిత కుటుంబాలకు నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం లెక్కలేనంత మందిని పొట్టన పెట్టుకున్నది. సరిహద్దు తీవ్రవాదంతో నష్టపోతున్న దేశంగా -
భారత్ అనేక దశాబ్దాలుగా ఈ పోరాటంలో ముందువరుసలో ఉంది.
ఉగ్రవాదం ఎప్పటికప్పుడు రూపాన్ని మార్చుకుంటున్నది. అది ఏ రూపంలో ఉన్నా దానిని అంతం చేసే వరకూ భారత్ వెనకడుగు వేయదు. ఆ దుష్టశక్తితో పోరాడే అన్ని ప్రయత్నాల్లోనూ మనం ఏకతాటిమీద నిలబడదాం.
2014లో 9/11 స్మారకాన్నీ, మ్యూజియాన్ని నేను సందర్శించినప్పటి కొన్ని దృశ్యాలు...’’.
(రిలీజ్ ఐడి: 2309172)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Bengali
,
Kannada
,
Bengali-TR
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam