ప్రధాన మంత్రి కార్యాలయం
అయిదో ఆగా ఖాన్ ప్రిన్స్ రహీంతో ప్రధానమంత్రి భేటీ
ఆగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్‌తో భాగస్వామ్యాన్ని పటిష్ఠపరుచుకోవడంపై చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
10 SEP 2026 2:59PM by PIB Hyderabad
ఇస్మాయిలీ సముదాయ 50వ ఆధ్యాత్మిక నేత, గౌరవ అయిదో ఆగా ఖాన్ ప్రిన్స్ రహీంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. ఆయన తండ్రి, కీర్తిశేషులు నాలుగో ఆగా ఖాన్నూ, అభివృద్ధి ప్రధాన కార్యకలాపాలకు ఆయన అందించిన నిరంతర తోడ్పాటునూ శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు.
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామాల అభివృద్ధి, యువత, మహిళా సాధికారత వంటి కీలక రంగాల్లో ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ (ఏకేడీఎన్)తో భాగస్వామ్యాన్ని ఇప్పటి కన్న మరింత బలపరుచుకొనే అవకాశాలపై ప్రధానమంత్రి చర్చించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:
గౌరవ అయిదో ఆగా ఖాన్ ప్రిన్స్ రహీంతో భేటీ కావడం సంతోషాన్నిచ్చింది. అభివృద్ధి ప్రధాన కార్యకలాపాలకు ఆయన తండ్రి, కీర్తిశేషులు నాలుగో ఆగా ఖాన్ అందించిన నిరంతర తోడ్పాటును ఈ సందర్భంగా ఆప్యాయంగా గుర్తుకు తెచ్చుకున్నాను.
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామాల అభివృద్ధి, యువత, మహిళా సాధికారత రంగాలలో ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్‌తో మన భాగస్వామ్యాన్ని ఇప్పటి కన్న మరింత పటిష్ఠపరుచుకోవడమెలాగన్నది చర్చించాను’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2308723)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam