|
పార్లమెంటరీ వ్యవహారాలు
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు అధ్యక్షతన జవహర్ నవోదయ విద్యాలయాల్లో నిర్వహించే 27వ జాతీయ యువ పార్లమెంట్ పోటీ (2025-26) బహుమతుల ప్రదానోత్సవం
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2026 11:52AM by PIB Hyderabad
జవహర్ నవోదయ విద్యాలయాల్లో నిర్వహించిన 27వ జాతీయ యువ పార్లమెంట్ పోటీ2025-26కి సంబంధించిన బహుమతి ప్రదానోత్సవం సెప్టెంబర్ 10న గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ సముదాయంలో గల పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరగనుంది.
ఈ కార్యక్రమానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలమంత్రి శ్రీ కిరెన్ రిజిజు అధ్యక్షత వహిస్తారు. పోటీలో ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించిన విద్యార్థులు, జవహర్ నవోదయ విద్యాలయాలకు ఆయన బహుమతులను అందజేస్తారు. 27వ జాతీయ యువ పార్లమెంట్ పోటీ 2025-26లో మొదటి స్థానంలో నిలిచిన మణిపూర్‌లోని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం, ఉఖ్రుల్-1 (షిల్లాంగ్ ప్రాంతం) విద్యార్థులు ఈ సందర్భంగా “యువ పార్లమెంట్ సమావేశం’’ కార్యక్రమాన్ని మరోసారి ప్రదర్శించనున్నారు.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో యువ పార్లమెంట్ పోటీలను గత 30 ఏళ్లుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖనే నిర్వహిస్తోంది. జవహర్ నవోదయ విద్యాలయాల కోసం ఉద్దేశించిన జాతీయ యువ పార్లమెంట్ పోటీ పథకం కింద 27వ పోటీని 2025-26లో దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయ సమితికి చెందిన 8 ప్రాంతాల్లోని 100 విద్యాలయాల మధ్య నిర్వహించారు.
యువతలో స్వీయ క్రమశిక్షణ, భిన్న అభిప్రాయాలను గౌరవించే గుణం, తమ అభిప్రాయాలను సరైన విధంగా వ్యక్తీకరించడం, ప్రజాస్వామ్య జీవన విధానానికి అవసరమైన ఇతర మంచి లక్షణాలను పెంపొందించడం ఈ యువ పార్లమెంట్ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. పార్లమెంట్ పనితీరు విధానాలు, కార్యకలాపాలు, చర్చా పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సమర్థవంతంగా మాట్లాడే నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుంది.
ఈ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, ఉఖ్రుల్-1, మణిపూర్‌కు (షిల్లాంగ్ ప్రాంతం) రన్నింగ్ పార్లమెంటరీ షీల్డ్, ట్రోఫీని ప్రదానం చేయనున్నారు. అలాగే తమ తమ ప్రాంతాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన కింది 7 జవహర్ నవోదయ విద్యాలయాలకు కూడా కేంద్రమంత్రి చేతుల మీదుగా ప్రతిభా ట్రోఫీలను అందజేయనున్నారు.
|
క్రమ సంఖ్య
|
విద్యాలయాల పేరు
|
ప్రాంతం
|
|
1.
|
పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, కొల్లం, కేరళ
|
హైదరాబాద్
|
|
2.
|
పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, థియోగ్, సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
|
చండీగఢ్
|
|
3.
|
పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, సూరత్‌గఢ్, శ్రీగంగానగర్-II, రాజస్థాన్
|
జైపూర్
|
|
4.
|
పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, మల్హర్, బిలాస్‌పూర్, ఛత్తీస్‌గఢ్
|
భోపాల్
|
|
5.
|
పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, వల్సాడ్, గుజరాత్
|
పూణే
|
|
6.
|
పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, పురులియా, పశ్చిమ బెంగాల్
|
పాట్నా
|
|
7.
|
పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, ఉధమ్ సింగ్ నగర్, ఉత్తరాఖండ్
|
లక్నో
|
***
(రిలీజ్ ఐడి: 2308476)
|