ప్రధాన మంత్రి కార్యాలయం
విద్యార్థులను సమాచారం తెలుసుకోవటం నుంచి విజ్ఞానం పొందే దిశగా నడిపించటంలో ఉపాధ్యాయుల కీలక పాత్రను కొనియాడుతూ కేంద్రమంత్రి రాసిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 SEP 2026 3:28PM by PIB Hyderabad
కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
భారతదేశంలో గురువులను గౌరవించే సంప్రదాయం... జ్ఞానాన్ని అందించేవారిపై ఉన్న అపారమైన గౌరవాన్ని సూచిస్తుందని కేంద్రమంత్రి కథనంలో పేర్కొన్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. విద్యార్థిని సమాచారం నుంచి అవగాహన దిశగా, అవగాహన నుంచి జ్ఞానం వైపు నడిపించటంలో ఉపాధ్యాయుని కీలక పాత్రను కథనం తెలియజేస్తుందని చెప్పారు. విద్యలో విద్యార్థులకే అత్యంత ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన జాతీయ విద్యా విధానం-2020... ఈ దిశగా కీలక ముందడుగు వేసిందని తెలిపారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
"భారతదేశంలో ఉపాధ్యాయులను గౌరవించే సంప్రదాయం కొనసాగటం, జ్ఞానాన్ని పంచే గురువులపై ఉన్న అపారమైన గౌరవాన్ని సూచిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి కథనంలో పేర్కొన్నారు.
విద్యార్థిని సమాచారం నుంచి అవగాహన దిశగా, అవగాహన నుంచి జ్ఞానం వైపు నడిపించటంలో ఉపాధ్యాయుని కీలక పాత్రను తెలియజేశారు. విద్యలో విద్యార్థులకే అత్యంత ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన జాతీయ విద్యా విధానం-2020... ఈ దిశగా కీలక ముందడుగు వేసిందని తెలిపారు"
****
(రిలీజ్ ఐడి: 2307106)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam