ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రతిభ పెంపొందడానికి సరైన వాతావరణం, మార్గదర్శకత్వం,


పోషణ ముఖ్యమన్న సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 SEP 2026 9:07AM by PIB Hyderabad

ప్రతిభ పొంపెందాలంటే సరి అయిన వాతావరణం, తగిన మార్గదర్శకత్వంతో పాటు పోషణ ముఖ్యమని చెబుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘అసలైన ప్రతిభకు సకారాత్మక, అనుకూల వాతావరణం జతపడినప్పుడు, అది అద్భుత శక్తిని ప్రకటిస్తుంది. ఫలితంగా ప్రయత్నాలు ఫలించడంతో పాటు జీవితం సార్థకమవుతుంది.
పాత్రవిశేషే న్యస్తం గుణాన్తరం వ్రజతి శిల్పమాధాతుః
జలమివ సముద్రశుక్తౌ ముక్తాఫలతతాం పయోదయస్య’’ అని పేర్కొన్నారు.
ఏ వ్యక్తి లేదా వస్తువు విలువ, గొప్పతనం చాలా వరకు అవి అందుకొనే వాతావరణం, మార్గదర్శకత్వంపై ఆధారపడతాయి. నీటి బిందువు నత్తగుల్ల చిప్పలోకి ప్రవేశిస్తే అమూల్య ముత్యంగా మారినట్లుగానే, సాధారణ సామర్థ్యాలు కూడా సరి అయిన చోటు, తగిన సహకారం, అనుకూలమైన పాలన, పోషణలు లభించినప్పుడు అసాధారణంగా మారుతాయి అని మనకు ఈ సుభాషితం బోధిస్తోంది.


(రిలీజ్ ఐడి: 2306332) సందర్శకుల సూచీ సంఖ్య : : 11