రక్షణ మంత్రిత్వ శాఖ
సీఈఎన్‌జేఓడబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో రెండో సంవత్సరం ‘ట్రైడెంట్ లెక్చర్’ను ప్రారంభించనున్న రక్షణ శాఖ సహాయ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
31 AUG 2026 1:12PM by PIB Hyderabad
సంయుక్త యుద్ధ అధ్యయన కేంద్రం (సెంటర్ ఫర్ జాయింట్ వార్‌ఫేర్ స్టడీస్.. సీఈఎన్‌జేఓడబ్ల్యూఎస్ CENJOWS) రెండో వార్షిక ట్రైడెంట్ ఉపన్యాస కార్యక్రమాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేఠ్ రేపు, అంటే 2026 సెప్టెంబరు 1న న్యూఢిల్లీలోని మానెక్షా సెంటర్లో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ‘దేశ నిర్మాణానికి నవ తరం సామర్థ్యాలను వినియోగించుకోవడం’ అంశంపై మంత్రి ప్రత్యేక ప్రసంగాన్నిస్తారు.
సీఈఎన్‌జేఓడబ్ల్యూఎస్ వార్షిక కార్యక్రమాల్లో భాగంగా, ‘రక్షణ బలగాల దృష్టికోణం నుంచి జాతీయ పునరుత్థానం’ (నేషనల్ రిసర్జెన్స్ త్రూ ది లెన్స్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్) అంశంపై ఒక ఉపన్యాసాన్ని నిర్వహిస్తారు. ఇదే కార్యక్రమంలో.. ‘సంయుక్త విన్యాసాలు, ఏకీకరణకు సంబంధించిన సరికొత్త కోణాలు (ఎమర్జింగ్ కాంటూర్స్ ఆఫ్ జాయింట్‌నెస్ అండ్ ఇంటిగ్రేషన్) అంశంపై చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ టు చైర్మన్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సీఐఎస్‌సీ), సంయుక్త యుద్ధ అధ్యయన కేంద్రం (సీఈఎన్‌జేఓడబ్ల్యూఎస్) చైర్మన్ ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ కీలకోపన్యాసాన్ని ఇవ్వనున్నారు. దీనికి అదనంగా, ‘పౌర, సైనిక సమ్మిళితత్వం: జాతీయ అభివృద్ధికి మార్గం’ (సివిల్ మిలటరీ ఫ్యూజన్: ది వే ఫర్ నేషనల్ గ్రోత్) అంశంపై లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా (రిటైర్డ్), ‘స్మార్ట్ పద్ధతుల్లో పోరాటం: బహుళ రంగాల కార్యకలాపాలు, సంయుక్త భావనలు’ (ఫైటింగ్ స్మార్ట్‌లీ: మల్టీ డొమైన్ ఆపరేషన్స్ అండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ జాయింట్‌నెస్) అంశంపై సైన్య సిబ్బంది ఉప ప్రధానాధికారి లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్‌ల ప్రత్యేక ప్రసంగాలు కూడా ఉంటాయి.
ఈ ఉపన్యాసాల కార్యక్రమం సమష్టితత్వం, ఏకీకరణ, బహుళ రంగాల్లో కార్యకలాపాల నిర్వహణ, పౌర సైనిక సమ్మేళనం, దేశ నిర్మాణంలో సాయుధ బలగాల పాత్ర వంటి విషయాలపై చర్చలు జరపడానికి సీనియర్ నాయకత్వాన్ని, ప్రఖ్యాత నిపుణులను ఒక చోట సమావేశపరచనుంది.
సీఈఎన్‌జేఓడబ్ల్యూఎస్‌ను ఏకీకృత రక్షణ సిబ్బంది ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో 2007లో ఏర్పాటు చేశారు. ఇది త్రివిధ దళాల సలహాదారు యంత్రాంగం. ఇది సంయుక్త సంగ్రామం, దేశ భద్రత, దేశంలో ఉన్న శక్తిని ఉపయోగించడానికి సంబంధించిన అంశాలపై పరిశోధన, విశ్లేషణతో పాటు విషయాలు తెలుసుకొని మరీ చర్చించడానికి ఒక వేదికను సమకూరుస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2305030)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9