ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ సంస్కృత దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 28 AUG 2026 12:06PM by PIB Hyderabad

 ప్రపంచ సంస్కృత దినోత్స‌వంతోపాటు ఈ రోజు శ్రావణపూర్ణిమ కావడంతో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలందరికీ ఆత్మీయ శుభాకాంక్ష‌లు తెలిపారు. భారతీయ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతల నిరంతర వాహినియైన సంస్కృతం శాశ్వతత్వం ఘనతను మనం ఇవాళ వేడుక చేసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. “ఈ ప్రత్యేక పర్వదినం నాడు భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం అభ్యసించే, బోధించే ప్రతి ఒక్కరినీ మనం  అభినందిద్దాం. వారందరూ ఈ భాషలోని అక్షయ నిధిని భవిష్యత్తరాలకు వారసత్వంగా ప్రసాదించేందుకు అవిరళ కృషి చేస్తున్నారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“విశ్వసంస్కృతదివసస్య శుభాశయః

అద్య, శ్రవణపూర్ణిమాదినే, వయం సంస్కృతస్య చిరంతన్-సమృద్ధేః

ఉత్సవం ఏష భాషా భారతస్య జ్ఞానస్య, చింతనస్య,

సర్జనశీలతాయః చ నిరంతర-సంవాహికా ఆశీతు తస్యాః

సకారాత్మకః ప్రభావః బహుషు క్షేత్రేషు అద్యాపి ద్రష్టుం శక్యతే।“ అని ప్రధానమంత్రి సంస్కృత శ్లోకాన్ని ఉటంకించారు.

అంటే- “ఈ శ్రావణ పౌర్ణమినాడు, మనం సంస్కృత వైభవాన్ని స్మరించుకుంటూ వేడుక చేసుకుంటున్నాం. ఈ భాష భారతీయ జ్ఞానాన్ని, ఆలోచనను, సృజనాత్మకతను నిరంతర ప్రపంచానికి అందిస్తోంది. దాని సానుకూల ప్రభావం నేటికీ అనేక రంగాల్లో ప్రస్ఫుటమవుతుంది” అని అర్థం… అలాగే,

ఏతస్మిన్ విశిష్టే దినే, భారతే విశ్వే చ యే సంస్కృతం పఠన్తి,

పాఠయంతి తథా ఏతః ॥ కాలాతీతం నిధిం

అగ్రిమసన్తత్యై ప్రాపయితుం ప్రయత్నశీలః శాంతి తాన్ సర్వాన్ వయం ప్రశంస.

అంటే- “ఈ పవిత్ర పర్వదినాన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం అభ్యసించే, బోధించే, అందులో అనాదిగా లభించే అక్షయ నిధిని భవిష్యత్తరానికి సంక్రమింపజేయడంలో కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ మనం అభినందిద్దాం” అని అర్థం.

 

***


(రిలీజ్ ఐడి: 2304108) సందర్శకుల సూచీ సంఖ్య : : 9