ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ ఎ. బాలకృష్ణన్ జీ కన్నుమూత ప్రధానమంత్రి సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 27 AUG 2026 12:11PM by PIB Hyderabad

వివేకానంద కేంద్రం అఖిల భారత అధ్యక్షుడు శ్రీ ఎ. బాలకృష్ణన్ గారి మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. సమాజానికి శ్రీ ఎ. బాలకృష్ణన్ గారు అందించిన గొప్ప సేవలను శ్రీ మోదీ స్మరించుకుంటూ, స్వామి వివేకానంద ఆదర్శాలకూ, దేశ సేవకూ  ఆయన తన జీవితంలో అయిదు దశాబ్దాల కన్నా ఎక్కువ కాలాన్ని అంకితం చేశారన్నారు. ‘‘ఆయనకు భారతదేశ ఈశాన్య ప్రాంతంతో విశిష్ట అనుబంధం ఉంది. విద్య, సామాజిక, దేశ నిర్మాణ కార్యకలాపాల్లో ఆయన కీలక పాత్రను పోషించారు’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘
వివేకానంద కేంద్రానికి అఖిల భారత అధ్యక్షునిగా సేవలను అందించిన శ్రీ ఎ. బాలకృష్ణన్ గారు ఇక లేరన్న వార్తను విని, ఎంతో చింతించాను.
స్వామి వివేకానంద ఆదర్శాలతో పాటు సమాజ సేవకు బాలకృష్ణన్ గారు తన జీవితంలో అయిదు దశాబ్దాల కన్నా ఎక్కువ కాలాన్ని అంకితం చేశారు. వివేకానంద కేంద్ర ప్రాథమిక జీవనవ్రతులలో ఒకరుగా దేశం నలు మూలలా అవిశ్రాంతంగా పనిచేశారు. భారత్ ఈశాన్య ప్రాంతంతో ఆయనకు విశిష్ట అనుబంధముంది. విద్య, సామాజిక, దేశ నిర్మాణ కార్యకలాపాల్లో ఆయన కీలక పాత్రను పోషించారు.
ఆయన అభిమానులకీ, వివేకానంద కేంద్రంతో ముడిపడిన అందరికీ నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2303667) సందర్శకుల సూచీ సంఖ్య : : 58