రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

దేశీయంగా నిర్మించిన రెండో డైవింగ్ సహాయక నౌక ‘నిపుణ్’ ఆగస్టు 31 నుంచి నౌకాదళం విధుల్లోకి ప్రవేశం

నాడు పోస్టు చేయడమైనది: 25 AUG 2026 3:53PM by PIB Hyderabad

సముద్రగర్భంలో నిర్వహించే పనుల కోసం ఉద్దేశించిన నిస్తార్ రకానికి చెందిన రెండో డైవింగ్ సహాయక నౌక (డీఎస్‌వీ)- ‘నిపుణ్’ 2026 ఆగస్టు 31 భారతీయ నౌకాదళం విధు్లో చేరుతోందిముంబయి డాక్ యార్డ్ నుంచి కార్యకలాపాలను ప్రారంభించనున్న ఈ విశిష్ట నౌక వల్ల సముద్ర మధ్యంలో డైవింగ్జలాంతర సహాయ సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడడంతో పాటు నౌకా నిర్మాణ కార్యకలాపాలు మొదలు సముద్ర జల సంబంధిత కార్యకలాపాలతో ముడిపడిన సేవ వరకూ ఒక కొత్త అధ్యాయానికి నాందీ ప్రస్తావన చేసినట్లు అవుతుంది.

 

నిపుణ్‌’ను విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్ సంస్థ (హెచ్ఎస్ఎల్దేశీయంగా రూపురేఖలు కల్పించడమే  కాకుండా నిర్మించింది కూడాఇది రక్షణ నౌకల నిర్మాణంలో ఆత్మనిర్భరతను సాధించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో ఓ మేలిమలుపుదీనిని అన్ని పరీక్షలను పూర్తి చేసిన తరువాత, 2026 జులై 30న భారత నౌకాదళానికి అప్పగించారుhttps://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2292073
సముద్ర జలాల్లో అడుగు భాగానికి పోయి వివిధ కార్యకలాపాలను పూర్తి చేయడానికి సాయపడేందుకు వీలుగా ‘నిపుణ్’ను తీర్చిదిద్దారుఆధునిక డైవింగ్ వ్యవస్థలనూనీటి అడుగున విభిన్న పనుల్ని చక్కబెట్టడానికి ఉపయోగపడగల పరికరాలనూ దీనిలో అమర్చారుసముద్రంలో సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో పనిచేయడానికి ప్రత్యేక శ్వాస పరికరాలను ఉపయోగించి నీటి అడుగున వస్తువులను శోధించే లేదా పని చేసే వ్యక్తులకు నిరంతరం సాయాన్ని ఈ నౌకతో అందించవచ్చునుజలాంతర్గామి పరిరక్షక కార్యకలాపాలను చేపట్టడంలో భారత నౌకాదళానికి ఇప్పుడున్న సామర్థ్యాన్ని ఈ నౌక మరింత పెంచనుంది.
ఈ నౌకలో మార్గనిర్దేశం చేయడానికిప్లాట్‌ఫాం నిర్వహణకీకచ్చిత కేంద్ర నిర్ధారణకీ ఉపయోగపడే ఆధునిక వ్యవస్థలను జతపరిచారుడైవింగుకీనీటి అడుగు భాగానికి చేరుకొని వైద్యసాయాన్ని అందించడానికీ కొన్ని ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేశారుఈ సామర్థ్యాల కారణంగా ఈ నౌక సముద్ర ఉపరితలం కింద సంక్లిష్ఠ కార్యకలాపాలకు పనికొచ్చే ఒక ఏకీకృత వేదికగా ఉపయోగపడుతుంది.
నిపుణ్’ సేవలు త్వరలో ఆరంభం కానుండటంతో భారత నౌకావాణిజ్య రంగ ప్రయోజనాలతో ముడిపడిన చోట్ల డైవింగ్‌తో పాటుసముద్ర  జలాల అడుగు ప్రాంతాల్లో విశిష్ట కార్యకలాపాలు చేపట్టడానికి భారత నౌకాదళానికి ఇప్పుడు ఉన్న సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందిస్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ నౌకకు నౌకాదళం విధులను అప్పగించే ఘట్టం..  నౌకాదళ అవసరాల్ని ఎప్పటికప్పుడు తీర్చడానికి సాంకేతికంగా అధునాతనవిశిష్ట సామర్థ్యం కలిగిన నౌకలను మన నేవీకి అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా భారత నౌకా నిర్మాణ విస్తారిత అనుబంధ వ్యవస్థ తన స్థాయిని అంతకంతకూ మెరుగుపరుచుకుంటోందని కూడా చాటిచెప్పనుంది.

***


(రిలీజ్ ఐడి: 2303193) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Malayalam