ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యూపీఐ సేవలు ప్రారంభమై దశాబ్దం పూర్తి చేసుకున్న నేపథ్యంలో తమ అనుభవాలను పంచుకోవాలని పౌరులకు ప్రధాని పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 25 AUG 2026 11:12AM by PIB Hyderabad

దశాబ్దం క్రితం ప్రారంభమై... భారతదేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ప్రధాన ఘట్టంగా నిలిచిన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐపరివర్తనాత్మక ప్రస్థానాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు.

గత పదేళ్లలో యూపీఐ సాధించిన విస్తరణ, స్థాయి గురించి వివరిస్తూ.. ప్రతి భారతీయుడూ గర్వపడేలా ఈ ప్రయాణం ఉందని శ్రీ మోదీ అన్నారుయూపీఐ వినియోగంలో ఎదురైన అనుభవాలతో పాటు అది తమ దైనందిన జీవితాలను ఎలా ప్రభావితం చేసిందో పంచుకోవాలని ప్రధానమంత్రి ప్రజలను ఆహ్వానించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి చేసిన పోస్టు:

భారత దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ప్రధాన మలుపుగా నిలుస్తూ దశాబ్దం కిందట యూపీఐ ప్రారంభమైంది.

ప్రతి భారతీయుడు గర్వపడేలా యూపీఐ విస్తరణవిస్తృతి ఉన్నాయి.

మీ యూపీఐ అనుభవం గురించి, అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో నాకు చెప్పండి.

#10YearsOfUPI


(రిలీజ్ ఐడి: 2303005) సందర్శకుల సూచీ సంఖ్య : : 19