ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన ‘డాలర్-రూపాయి మార్పిడి’ పథకంతో దేశంలోకి భారీగా వస్తున్న విదేశీ మారకద్రవ్యం
కేవలం 11 వారాల్లో 73 బిలియన్ డాలర్ల మేర సమీకరించిన దేశీయ బ్యాంకులు
భారత బ్యాంకింగ్ రంగం.. ఆర్థిక వ్యవస్థపై ప్రవాస భారతీయుల నమ్మకాన్ని ప్రతిబింబించిన పథకం
నాడు పోస్టు చేయడమైనది:
24 AUG 2026 7:53PM by PIB Hyderabad
భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఈ ఏడాది జూన్ 8న ‘అమెరికా డాలర్ – రూపాయి విదేశీ మారకం మార్పిడి’ పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఎఫ్‌సీఎన్‌ఆర్(బి)’ డిపాజిట్లు, విదేశీ కరెన్సీ రుణాలు (ఓఎఫ్‌సీబీ), బాహ్య వాణిజ్య రుణాల (ఈసీబీ) రూపంలో దేశంలోకి విదేశీ మారకద్రవ్యం భారీగా రావడంలో ఈ పథకం ఎంతగానో దోహదపడింది. ఈ మేరకు ఆగస్టు 21 నాటికి 73 బిలియన్ డాలర్ల దాకా విదేశీ మారకద్రవ్యం సమీకృతమైంది. ఇందులో ‘ఎఫ్‌సీఎన్‌ఆర్(బి) డిపాజిట్ల వాటా అత్యధికంగా 65.40 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ పథకంపై ప్రవాస భారతీయుల అద్భుత స్పందనకు ఇదే నిదర్శనం.
భారత బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రవాస భారతీయుల విశ్వాసాన్ని ఈ పథకం విజయం ప్రతిబింబిస్తోంది. తదనుగుణంగా వారు తమ పొదుపు నిధులను అంచనాలకు మించి ‘ఎఫ్‌సీఎన్‌ఆర్(బి)’ డిపాజిట్లలో మదుపు చేశారు. భారత వృద్ధి ప్రస్థానంపై తమ నమ్మకంతో పాటు ఆర్థిక, భావోద్వేగ అనుబంధాన్ని ఈ విధంగా వారు మరోసారి చాటుకున్నారు. ఈ పథకం విజయంతో దేశీయ ఆర్థిక వ్యవస్థకు ప్రవాస భారతీయుల బలమైన అండ, నిబద్ధత స్పష్టమయ్యాయి.
ఈ పథకం గడువు 12 వారాలు కాగా, మరొక వారం మిగిలి ఉండగానే, 73 బిలియన్ డాలర్ల లక్ష్యం పూర్తికావడం విశేషం. భారత్ చేపట్టిన అతిపెద్ద, అత్యంత వేగవంతమైన విదేశీ మారక సమీకరణ ప్రక్రియకు ఇదొక నిదర్శనంగా నిలిచింది. లోగడ 2013లో అమలు చేసిన ఇదే పథకం కింద సుమారు 3 నెలల వ్యవధిలో 26 బిలియన్ డాలర్లను మాత్రమే ఆర్‌బీఐ సమీకరించగలిగింది. ప్రవాస భారతీయుల బలమైన స్పందన ఫలితంగా నిర్దేశిత లక్ష్యాన్ని గడువుకన్నా ముందే సాధించింది. ఈ నేపథ్యంలో ఒక నెల ముందుగా.. అంటే- సెప్టెంబరు 30కి బదులు ఆగస్టు 31న ఈ పథకాన్ని ముగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.
ప్రవాస భారతీయుల నుంచి దీర్ఘకాలిక డిపాజిట్లు, సంస్థాగత వాణిజ్య నిధులను భారీ స్థాయిలో సమర్థంగా సమీకరించడం ద్వారా అత్యంత తక్కువ వ్యయంతో బాహ్య ఆర్థిక భద్రతను భారత్ పటిష్టం చేసుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అధారణ ఒడుదొడుకులను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడాన్ని ఈ అద్భుత స్పందన రుజువు చేసింది.
***
(రిలీజ్ ఐడి: 2303001)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24