ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

దేశంలో మొదటి జీఎంవో రహిత, విస్తరణానుకూల పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన ఉపరాష్ట్రపతి


భారతీయ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా సాంకేతికత, ఆవిష్కరణ, ఆత్మనిర్భరతకు పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి

ఆత్మనిర్భర భారత్‌ను సంపూర్ణంగా ప్రతిబింబించేలా దేశీయ పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనం: ఉపరాష్ట్రపతి

‘‘ఒక చిన్న ఆరంభం గొప్ప సంకల్పానికి, స్వప్నానికి నాంది పలకాలి”: ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ మార్కెట్ల వరకు గౌర్మెట్ పాప్‌కార్నికా ప్రస్థానాన్ని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి

प्रविष्टि तिथि: 24 AUG 2026 2:05PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా ముసునూరులో దేశంలోనే తొలిసారిగా అభివృద్ధి చేసిన జీఎంఓ రహిత, అధిక విస్తరణ సామర్థ్యం కలిగిన పాప్‌కార్న్ మొక్కజొన్న సంకర జాతి విత్తనాన్ని ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు ఆవిష్కరించారు. వ్యవసాయ రంగంలో ఆత్మనిర్భర భారత్ దిశగా ఇదొక కీలకమైన ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరో ఏడు రాష్ట్రాలకు చెందిన ఉత్తమ రైతులనూ, ‘గౌర్మెట్ పాప్‌కార్నికా’ సంస్థ భాగస్వాములను ఈ సందర్భంగా ఆయన సన్మానించారు.

సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... రైతులే దేశానికి వెన్నెముక అని, భారతదేశ నాగరికతను, సాంస్కృతిక జీవనాన్ని వ్యవసాయమే తీర్చిదిద్దిందని ఉపరాష్ట్రపతి అన్నారు. భారతీయ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో సాంకేతికత, ఆవిష్కరణలు, దేశీయంగా విత్తనాభివృద్ధి ఆవశ్యకతను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

ఈ ఆవిష్కరణ గురించి మాట్లాడుతూ.. నాణ్యమైన పాప్‌కార్న్ మొక్కజొన్న కోసం భారత్ అనేక సంవత్సరాలుగా దిగుమతి చేసుకున్న హైబ్రిడ్ సాంకేతికతపైనే ఆధారపడిందని శ్రీ సి.పి. రాధాకృష్ణన్ చెప్పారు. ఈ నూతన దేశీయ హైబ్రిడ్ విత్తనం వల్ల.. దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవడంలో కీలకమైన ముందడుగు అని ఆయన అన్నారు. భారత నేలలో పెరిగే ఈ దేశీయ విత్తనాన్ని అభివృద్ధి చేసి, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడే సామర్థ్యాన్ని సాధించిన గౌర్మెట్ పాప్‌కార్నికా సంస్థను, రైతులను ఆయన అభినందించారు.

పీఎం-కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్, నమో డ్రోన్ దీదీ వంటి కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. అలాగే రైతు బజార్లు, ఉద్యాన పంటలు, సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం, రైతులకు దన్నుగా నిలిచే వ్యవస్థలు సహా.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో దూరదృష్టితో కార్యక్రమాలను చేపడుతున్న ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడిని కూడా ఆయన ప్రశంసించారు.

రైతులు - పరిశ్రమల మధ్య భాగస్వామ్య విస్తృతిని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ఎనిమిది రాష్ట్రాల్లోని 40,000 ఎకరాలలో సాగు చేస్తున్న 17,500 మందికి పైగా రైతులు ‘గౌర్మెట్ పాప్‌కార్నికా’ ప్రయాణంలో భాగమయ్యారని శ్రీ సి.పి. రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక చిన్న స్థానిక సంస్థగా ప్రారంభమై, నేడు ఒక ప్రధాన పాప్‌కార్న్ మొక్కజొన్న ప్రాసెసింగ్ పరిశ్రమ స్థాయికి దీన్ని తీసుకెళ్లిన శ్రీ ఎస్.బి.పి. పట్టాభి రామారావు, గౌర్మెట్ పాప్‌కార్నికా ప్రస్థానాన్ని ఆయన కొనియాడారు. వేలాది రైతు కుటుంబాలకు మెరుగైన మార్కెట్ సదుపాయాలనూ, ఆదాయ అవకాశాలనూ ఇది మరింత బలోపేతం చేసిందని కొనియాడారు.

భూమి నుంచే - అంటే, రైతులు సాగు చేసే నేల, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చేసే విత్తనాలు, ప్రతి ఎకరాలోనూ పటిష్టమయ్యే ఆత్మనిర్భరతల నుంచే.. వికసిత భారత నిర్మాణం సాకారమవుతుందని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ఆవిష్కరణలు, పారిశ్రామిక ఆలోచనలు, రైతుల భాగస్వామ్యం కలగలిస్తే.. వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టంగా, ఆత్మనిర్భరగా, అంతర్జాతీయంగా పోటీపడేలా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దగలవో చెప్పేందుకు ముసునూరులో చేపట్టిన కార్యక్రమం నిదర్శనమన్నారు.

ఇక్కడికి చేరుకున్న వెంటనే గౌర్మెట్ పాప్‌కార్నికా కర్మాగారాన్నీ, శీతలీకరణ గిడ్డంగినీ ఉపరాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులు మొక్కజొన్న ప్రాసెసింగ్, నాణ్యతా నియంత్రణ, ప్యాకేజింగ్, నిల్వ చేసే విధానాలను ఆయనకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు శ్రీ నారా లోకేశ్, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీ కొలుసు పార్థసారథి, ఇతర ప్రముఖులు, గౌర్మెట్ పాప్‌కార్నికా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

 

***


(रिलीज़ आईडी: 2302818) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Telugu_Vw , Malayalam