జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో ఇద్దరు మణిపూర్ వ్యక్తులపై జరిగిన భౌతిక దాడిని సుమోటోగా స్వీకరించిన భారత ఎన్‌హెచ్ఆర్‌సీ


తీవ్రంగా గాయపడిన ఒకరు విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం

ఈ ఘటనపై రెండు వారాల్లోగా నివేదిక అందించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు నోటీసు జారీ చేసిన కమిషన్

నాడు పోస్టు చేయడమైనది: 19 AUG 2026 12:41PM by PIB Hyderabad

ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో ఇద్దరు మణిపూర్ వ్యక్తులపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసినట్లు వచ్చిన మీడియా కథనాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనలో ఒకరికి తలకి తీవ్రంగా గాయాలవగా, ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

వార్తా నివేదికలోని విషయాలు నిజమయితే, అది మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశమని కమిషన్ గుర్తించింది. ఈ ఘటనపై సమగ్ర నివేదికను రెండు వారాల్లోగా అందజేయాలని కోరుతూ ఢిల్లీ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. దర్యాప్తు వివరాలతో పాటు గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను కూడా నివేదికలో చేర్చాలని తెలిపింది.

మీడియా నివేదిక ప్రకారం… చిన్న విషయంలో తలెత్తిన వివాదం వల్ల ఆగస్టు 14, 2026న బాధితులపై దాడి జరిగింది.

 

***


(రిలీజ్ ఐడి: 2301204) సందర్శకుల సూచీ సంఖ్య : : 56
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Bengali-TR , Assamese , Tamil