ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పరుల శ్రేయస్సు కోరుతూ, ఉపకార ప్రధానమైన పనులు చేయాలని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 19 AUG 2026 8:18AM by PIB Hyderabad

ఇతర ప్రాణికోటి శ్రేయస్సును, సంక్షేమాన్ని కోరి, అందుకోసం నిరంతరం పాటుపడటంలోనే మనిషి జీవిత పరమార్థం ఇమిడిపోయి ఉందని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

‘‘ఏతావజ్జన్మసాఫల్యం దేహినామహి దేహిషు
ప్రాణైరర్థైర్థియా వాచా శ్రేయ ఏవాచరేత్సదా’’ అన్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు.
ఈ ప్రపంచంలో తోటి ప్రాణుల మేలు కోరుకుంటూ మన శారీరక శక్తి సామర్థ్యాన్ని, ధనాన్ని, బుద్ధిని, వాక్కుని పరోపకారానికి ఉపయోగిస్తూ శ్రేయోదాయక, సంక్షేమ ప్రధాన కార్యాల్ని  నిరంతరాయంగా చేపడుతూ ఉండడంలోనే మానవ జీవన సాఫల్యం ఇమిడి ఉందని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ఏతావజ్జన్మసాఫల్యం దేహినామహి దేహిషు
ప్రాణైరర్థైర్థియా వాచా శ్రేయ ఏవాచరేత్సదా’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2301189) సందర్శకుల సూచీ సంఖ్య : : 49