ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధాని సంతాపం
प्रविष्टि तिथि:
17 AUG 2026 1:32PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో సంభవించిన ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ప్రమాద బాధితులకు స్థానిక యంత్రాంగం అవసరమైన సాయం అందిస్తోందని ప్రధాని తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
‘‘పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించిందని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రమాద బాధితులకు స్థానిక యంత్రాంగం సాయం అందిస్తోంది.’’
***
(रिलीज़ आईडी: 2300402)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam