ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సమష్టి సంకల్పం, ఏకత, పరస్పర సహకారం... వీటికి ఉన్న శక్తే సామాజిక పురోగతికి తోడ్పడుతుందనే సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 17 AUG 2026 9:40AM by PIB Hyderabad

దేశ ప్రగతికి, సామాజిక శ్రేయస్సుకి ప్రజలందరి మనసుల్లో ఉమ్మడి సంకల్పంతో పాటు ఏకత్వం కూడా నెలకొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘సామూహిక సంకల్పం, ఏకత.. వీటికి గల శక్తితోనే దేశం పురోగమిస్తుంది. ఈ భావనలే భారత ప్రగతికిి, సమృద్ధికి బలమైన పునాదులుగా నిలుస్తున్నాయి.
సమానీ వ ఆకూతిః సమానా హృదయాని వః
సమానమస్తు వో మనో యథా వః సుసహాసతి’’.
మన అందరి సంకల్పాలూ ఒకే విధంగా ఉండాలి, ఐకమత్య భావనతో మన మనసులు పరస్పరం ముడిపడాలి. అది జరిగినప్పుడు, మనమంతా పరస్పరం సహకరించుకుంటూ, సమాన వ్యవహార సరళిని అవలంబిస్తూ సమాజ ప్రగతికి నిరంతరాయంగా కృషి చేయవచ్చు’’ అని పేర్కొన్నారు.

 

***

MJPS/SS/PRK


(रिलीज़ आईडी: 2300323) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam