పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వారణాసి విమానాశ్రయంలో ప్రమాదవశాత్తూ పేలిన లైసెన్స్ ఆయుధం

నాడు పోస్టు చేయడమైనది: 16 AUG 2026 2:02PM by PIB Hyderabad

వారణాసి నుంచి ముంబయికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX 1810లో ఈ రోజు సుమారు 09:30 గంటలకు ప్రయాణించవలసిన కమలేష్ కేదార్‌నాథ్ రాయ్ అనే ప్రయాణికుడు... నిర్దేశిత విధానం ప్రకారం చెక్-ఇన్ కౌంటర్ వద్ద లైసెన్స్ గల తన తుపాకీని (21 తూటాలతో కూడిన 7.62 ఎమ్ఎమ్ పిస్టల్) అందజేశారు.

తప్పనిసరి భద్రతా ప్రక్రియలను పూర్తి చేయడం కోసం ప్రయాణికుడిని సిబ్బంది నిర్దేశిత స్క్రీనింగ్ ప్రాంతానికి తీసుకువెళ్లారు. ప్రక్రియలో భాగంగా ఆయుధాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఒక తూటా పేలింది. ఆ తూటా పక్కకు దూసుకెళ్లడంతో స్క్రీనింగ్ సిబ్బంది రోహిత్ రాజ్, సుమన్ కుమారిలకు గాయాలయ్యాయి.

గాయపడిన ఇద్దరు సిబ్బందికి తక్షణం ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్య చికిత్స కోసం వారణాసిలోని న్యూలక్ష్మి ట్రామా సెంటర్‌కు తరలించారు.

సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. విచారణ, చట్టపరమైన తదుపరి చర్యల నిమిత్తం ఆ ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విమానాశ్రయాల్లో లైసెన్స్ పొందిన ఆయుధాలను వెంట ఉంచుకోవడం, తమతో పాటు తీసుకువెళ్ళడానికి నిర్దేశించిన విధానాలను సదరు ప్రయాణికుడు పాటించారా లేదా అనే విషయంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) నిశితంగా పరిశీలిస్తోంది. పరిశీలనలో తేలిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

సంఘటన జరిగిన వెంటనే విమానశ్రయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. విమానాశ్రయ కార్యకలాపాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2300200) సందర్శకుల సూచీ సంఖ్య : : 60
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil