ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు


ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల ధైర్యం, త్యాగం, అచంచలమైన నిబద్ధతను స్మరించుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 15 AUG 2026 6:46AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వలస పాలన అంతానికి కారణమైన మన ధైర్యవంతులైన స్వాతంత్య్ర సమరయోధులు మాతృభూమి కోసం చూపిన అద్భుతమైన ధైర్యం, అవిశ్రాంత పోరాటం, సాటిలేని అంకితభావానికి ఈ జాతీయ పండుగ ఒక హృద్యమైన జ్ఞాపికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

వారి కలలు మనకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని పేర్కొన్న ప్రధానమంత్రి... వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసుకునేందుకు సమష్టిగా కృషి చేస్తున్న మనం వారి ఆదర్శాలు స్ఫూర్తిగా అంకితభావంతో ముందుకు సాగాలని పౌరులను కోరారు.

140 కోట్ల మంది భారతీయుల శక్తితో మన దేశం అనేక రంగాల్లో ప్రగతి పథంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి ప్రయాణం రాబోయే కాలంలో మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

‘ఎక్స్’ వేదికగా ఒక పోస్టులో, ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

 ధైర్యం, త్యాగం, అచంచలమైన నిబద్ధతతో వలస పాలన అంతానికి కారణమైన ఎందరో స్వాతంత్య్ర సమరయోధులను మనం కృతజ్ఞతతో స్మరించుకుందాం. వికసిత భారత్‌ను నిర్మించడానికి మనం కలిసికట్టుగా కృషి చేస్తున్నప్పుడు, వారి ఆదర్శాలు మనకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.

140 కోట్ల మంది భారతీయుల శక్తితో మన దేశం అనేక రంగాల్లో ప్రగతి శిఖరాలను అధిరోహిస్తోంది. ఈ ప్రయాణం రాబోయే కాలంలో మరింత వేగంగా ముందుకు సాగాలని ఆశిద్దాం.

 

 

***

MJPS/SS/PRK


(రిలీజ్ ఐడి: 2299744) సందర్శకుల సూచీ సంఖ్య : : 47