చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యాయ విభాగంలో నవీకరించిన ఇండియా కోడ్ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్

చట్టాలను సులభంగా, వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చేలా, మరింత పౌర కేంద్రకంగా మార్చేలా మెరుగుపరిచిన పోర్టల్‌

ఏఐ ఆధారిత, సిమాంటిక్, స్పీచ్ శోధనలు, మెరుగైన నేవిగేషన్, బహుళ భాషల్లో సమాచారం లాంటి కీలకమైన ఫీచర్లు

प्रविष्टि तिथि: 13 AUG 2026 8:54PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్–2లో 2026 ఆగస్టు 13న నవీకరించిన ఇండియా కోడ్ పోర్టల్‌ను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రారంభించారుఈ కార్యక్రమంలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ ఆర్ వెంకటరమణిశాసన విభాగంన్యాయ వ్యవహారాల విభాగం కార్యదర్శి డాక్టర్ రాజీవ్ మణిఅదనపు కార్యదర్శి డాక్టర్ మనోజ్ కుమార్శాసన విభాగానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారువీరితో పాటుగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీడైరెక్టర్ జనరల్ శ్రీ ప్రియాంక్ భార్తిఇండియా ఏఐ మిషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ సుదీప్ శ్రీవాస్తవఎన్ఐసీకి చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

ఆధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి అందరికీ సులభంగావేగంగా చట్టాలను అందుబాటులోకి తీసుకురావడానికీవాటిని పౌర కేంద్రకంగా మార్చడానికీ ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాల్లో ముఖ్యమైన సందర్భాన్ని నవీకరించిన ఈ పోర్టల్ ప్రారంభం సూచిస్తుంది.

ఈ సందర్భంగా ప్రసంగించిన శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యాంగ ప్రాముఖ్యాన్ని, అందరికీ చట్టాలు సులభంగా అందుబాటులో ఉండేలాఅర్థమయ్యేలా చూడాల్సిన అవసరాన్ని వివరించారురాజ్యాంగంకేంద్ర చట్టాలునిబంధనలుఇతర శాసనపరమైన సమాచారాన్ని పౌరులు సులభంగా పొందేందుకు విశ్వసనీయమైనసమగ్రమైన వేదికగా ఇండియా కోడ్ పోర్టల్ పనిచేస్తుందన్నారుచట్టాన్ని ప్రజలకు చేరువ చేయడంలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర గురించి వివరించారుఈ పోర్టల్‌ను మెరుగుపరచడంలోసమన్వయం చేయడంలోపర్యవేక్షించడంలో శాసన విభాగ అధికారులుసిబ్బంది అంకితభావంతో చేసిన కృషిని అభినందించారుఅలాగే సాంకేతిక నైపుణ్యంఅభివృద్ధిలో తోడ్పాటు అందించిన ఎన్ఐసీ బృందాన్ని కూడా ప్రశంసించారుచట్టాలకు సంబంధించిన సమాచారాన్ని పౌరులకు మరింత సులభంగాపారదర్శకంగావారి అవసరాలకు అనుగుణంగా అందించడంలో ఈ ఉమ్మడి కృషి గణనీయంగా తోడ్పడుతుందని శ్రీ మేఘ్వాల్ తెలిపారు.

చట్టాలను భౌతిక రూపం నుంచి డిజిటల్ రూపంలోకి తీసుకురావడం గురించి శ్రీ ఆర్ వెంకటరమణి వివరించారు. నూతనవినియోగదారునికి అనుకూలమైన ఫీచర్లతో అభివృద్ధి చేసిన నూతన ఇండియా కోడ్ పోర్టల్‌ను ప్రశంసించారువెబ్‌సైటును సాంకేతికపరంగా నవీకరించడంకొత్తగా ఎదురవుతున్న అవసరాలకు అనుగుణంగా స్పందించేలా చూడటానికున్న ప్రాముఖ్యాన్ని ఆయన వివరించారుస్పష్టమైనసమర్థమైననాణ్యమైన చట్టాల రూపకల్పనలో శాసన విభాగ అధికారుల బాధ్యత గురించి తెలియజేశారుచట్టాలను అందరికీ చేరువ చేయాల్సిన అవసరముందన్నారుఈ కొత్త పోర్టల్ రూపకల్పనలో శాసన విభాగంసాంకేతిక బృందం చేసిన సమన్వయ కృషిని ఆయన ప్రశంసించారుదీని ద్వారా చట్టాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు మరింత పారదర్శకంగా చేరువవుతుందని ఆయన తెలిపారు.

ఇండియా కోడ్ పోర్టల్ పరిణామాన్ని శాసన విభాగం, న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ మణి వివరించారుపౌరులున్యాయ నిపుణులుప్రభుత్వ విభాగాలుఇతర భాగస్వాములకు చట్టాల గురించి కచ్చితమైనతాజా సమాచారాన్ని సులభంగా అందించేందుకు చేస్తున్న కృషిని ఆయన తెలియజేశారుచట్టాలను అందరికీ చేరువయ్యేలా చేయడంలో సాంకేతికత పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారునవీకరించిన పోర్టల్లో ఏర్పాటు చేసిన సులభమైన ఇంటర్‌ఫేస్మెరుగైన శోధననావిగేషన్యాక్సెస్ లాంటి ప్రధాన ఫీచర్ల గురించి వివరించారుఈ పోర్టల్ రూపకల్పనలో శాసన విభాగంనేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీచేసిన సమన్వయ కృషిని ఆయన అభినందించారుఈ కొత్త వేదిక ద్వారా చట్టాలకు సంబంధించిన విశ్వసనీయమైన సమాచారం ప్రజలకు మరింత విస్తృతంగాసులభంగా అందుబాటులోకి వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

నవీకరించిన ఇండియా కోడ్ పోర్టల్‌ గురించి శాసన విభాగం అదనపు కార్యదర్శి డాక్టర్ మనోజ్ కుమార్ వివరించారు. దీని ప్రధాన ఫీచర్లనుఈ మార్పు వెనక ఉన్న విస్తృత లక్ష్యాల గురించి తెలియజేశారున్యాయాన్ని పొందడానికి చట్టాల గురించి తెలుసుకోవడమే తొలి మెట్టు అని ఆయన చెప్పారుఅలాగే.. చట్టాలు అందుబాటులో ఉండటంతో పాటు వాటిని సులభంగా వెతికి అర్థం చేసుకొనిఉపయోగించుకొనేలా ఉండాలన్నారుచట్టపరమైన పత్రాల భాండాగారంలా మాత్రమే కాకుండా.. ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యే పౌర కేంద్రీకృత డిజిటల్ వేదికగా ఈ నూతన పోర్టల్‌ను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారుమెరుగైన సెర్చ్నావిగేషన్చట్టాలకు అనుబంధ చట్టాలతో అనుసంధానం-గెజిట్ వ్యవస్థతో విలీనంఏఐ ఆధారిత సెర్చ్వాయిస్ ద్వారా వెతికే సదుపాయంబహుళ భాషల మద్దతు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నట్లు తెలియజేశారుచట్టానికీప్రజలకూ మధ్య ఉన్న దూరాన్ని సాంకేతికత తగ్గించాలని ఆయన స్పష్టం చేశారుచట్టపరమైన సమాచారాన్ని మరింత సులభంగా తెలుసుకునేలావాడుకునేలా చేయాలని సూచించారుతద్వారా పారదర్శకతచట్టాలపై అవగాహనపౌర కేంద్రీకృత పాలన మరింత బలోపేతమవుతాయన్నారు.

కేంద్ర చట్టాలు, వాటి అనుబంధ చట్టాలురాష్ట్ర చట్టాలువాటి అనుబంధ చట్టాలుకేంద్ర పాలిత ప్రాంతాల చట్టాలునిబంధనలను ఒకే చోట అందించే డిజిటల్ వేదికగా ఇండియా కోడ్ పనిచేస్తుందికొత్తగా తీర్చిదిద్దిన ఈ పోర్టల్ ద్వారా చట్టాలకు సంబంధించిన సమాచారాన్ని పౌరులున్యాయ నిపుణులుపరిశోధకులున్యాయవ్యవస్థప్రభుత్వం సులభంగా శోధించివాటిని పొందవచ్చుఇందులో మెరుగైన ఇంటెలిజెంట్ సెర్చ్ఏఐ ఆధారితసెమాంటిక్స్పీచ్ ఆధారిత శోధనలుచట్టాల సవరణలువాటి చరిత్రకు సంబంధించిన సమాచారంసంబంధిత అనుబంధ చట్టాలతో చట్టాల అనుసంధానం-గెజిట్ వ్యవస్థతో ఏకీకరణమెరుగైన డాక్యుమెంట్ వీక్షణక్యూఆర్ ఆధారిత యాక్సెస్క్రమబద్ధమైన పౌర అభిప్రాయ సేకరణ విధానం ఉన్నాయిఇది రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చిన 22 భాషల్లోనూ చట్టాలను ఏఐ ద్వారా అందించేందుకు ప్రయత్నిస్తుందితద్వారా దేశం అంతటా చట్టాలను విస్తృతంగాసులభంగా అందుబాటులోకి తీసుకువచ్చి మరింత పౌరకేంద్రకంగా మారుస్తుంది.

ఇండియా కోడ్‌ను కేవలం చట్టాలను భద్రపరిచే ఆన్‌లైన్ భాండాగారంగా మాత్రమే కాకుండా, చట్టాలను సులభంగా అందించే డిజిటల్ వేదికగా మార్చడమే ఈ సాంకేతిక ఆధునికీకరణ ప్రధాన లక్ష్యందీనికి పరస్పర అనుసంధానమైనపౌరులకు అనుకూలమైన న్యాయ సమాచార వ్యవస్థ అండగా నిలుస్తుంది.

చట్టాలను సులభంగా తెలుసుకోవడం, పారదర్శకతను పెంచడంపౌరుల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంన్యాయపౌర సేవలను మరింత మెరుగ్గా ప్రజలకు అందించడానికి సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలనే విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంది.

భారతదేశం కోసం విశ్వసనీయమైన, సాంకేతికత ఆధారిత న్యాయ సమాచార వ్యవస్థను నిర్మించే దిశగా వేసిన ముఖ్యమైన అడుగే నవీకరించిన ఇండియా కోడ్ పోర్టల్దీని ద్వారా చట్టాలను సులభంగా వెతికివాటి గురించి తెలుసుకోవచ్చుఅలాగే చట్టాల మధ్య ఉన్న సంబంధాలను కూడా తెలుసుకోవచ్చుపౌరులకు అనువైన భాషలోరూపంలో ఇవి అందుబాటులో ఉంటాయి.

 

***


(रिलीज़ आईडी: 2299469) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Malayalam