చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
న్యాయస్థానాల్లో మహిళలకు అనుకూల మౌలిక సదుపాయాలు
प्रविष्टि तिथि:
13 AUG 2026 3:53PM by PIB Hyderabad
న్యాయవ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. అయినప్పటికీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వనరులను మెరుగుపరచడం కోసం.. జిల్లా, దిగువ కోర్టుల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 1993-94 నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేస్తోంది. కోర్టు హాళ్లు, న్యాయాధికారుల నివాస గృహాలు, న్యాయవాదుల హాళ్లు, టాయిలెట్ కాంప్లెక్సులు, డిజిటల్ కంప్యూటర్ గదులు అనే ఐదు ప్రధాన అంశాలు దీని పరిధిలోకి వస్తాయి.
కోర్టు హాల్లో మహిళా అనుకూల మౌలిక సదుపాయాలు సహా వివిధ నిర్దిష్ట అంశాలు హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి. కోర్టు హాలు నమూనాలనూ, ఈ కేంద్ర ప్రాయోజిత పథకం కింద నిధులను పొందే ప్రాజెక్టులనూ హైకోర్టు భవన మౌలిక సదుపాయాల కమిటీ ఆమోదిస్తుంది. అయినప్పటికీ.. సుప్రీంకోర్టుకు చెందిన జాతీయ న్యాయస్థానాల నిర్వహణ వ్యవస్థ (ఎన్‌సీఎంఎస్) కమిటీ కమిటీ సిఫార్సులూ, వివిధ రాష్ట్రాలు, సీపీడబ్ల్యూడీ అనుసరిస్తున్న నిబంధనలు, విధానాల ఆధారంగా... కోర్టు హాలుకు సంబంధించి ప్రమాణాలనూ, నిర్దేశాలనూ ఈ పథకం మార్గదర్శకాలు అందిస్తాయి.
రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో.. న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర), పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రాం మేఘ్వాల్ ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2299030)
आगंतुक पटल : 6