రైల్వే మంత్రిత్వ శాఖ
బంంగ్లాదేశ్ రైల్వే కోసం తొలి ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల మొదటి రేక్‌ను సిద్ధం చేయనున్న కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ
प्रविष्टि तिथि:
11 AUG 2026 8:09PM by PIB Hyderabad
కపుుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ మరో కీలక మైలురాయిని అధిగమించనుంది. బంగ్లాదేశ్ రైల్వే కోసం 19 ఎల్‌హెచ్‌బీ బ్రాడ్‌గేజ్ ప్రయాణికుల కోచ్‌లతో కూడిన తొలి రేక్‌ను 2026 ఆగస్టు 12న ప్రారంభించనుంది.
తొలి రేక్‌లో 3 ఏసీ స్లీపర్ కోచ్‌లు, 3 ఏసీ చైర్ కార్లు, 11 నాన్ ఏసీ చైర్ కార్లు, 2 పవర్ కార్లు ఉన్నాయి. ఈ కోచ్‌లలో పలు ప్రత్యేక డిజైన్ అంశాలు, మార్పులు పొందుపరిచారు. వీటిలో అనేక మార్పులను ఎల్‌హెచ్‌బీ తరహా కోచ్‌లలో తొలిసారిగా అభివృద్ధి చేశారు.
బంగ్లాదేశ్ రైల్వే నిర్వహణ, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఈ కోచ్‌లను ప్రత్యేకంగా రూపొందించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరిచేలా స్టెయిన్‌లెస్ స్టీల్ ఆర్మ్‌రెస్ట్‌లు, ఫుట్‌రెస్ట్‌లతో కూడిన ప్రత్యేకంగా రూపొందించిన రిక్లైనింగ్ చైర్లను సీటింగ్ వ్యవస్థలో ఏర్పాటు చేశారు. వీటిని ప్రయాణికులు తమ సౌకర్యానికి అనుగుణంగా వివిధ కోణాల్లో వెనక్కి వాల్చుకునేలా రూపొందించారు. ఈ కోచ్‌లలో ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యమిస్తూ పలు ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఏసీ కోచ్‌లలో ఫ్యాన్లు, సమగ్ర సీసీటీవీ నిఘా వ్యవస్థ, ప్రయాణికుల అలారం వ్యవస్థ, పాక్షికంగా తెరవగలిగే కిటికీలు, బేబీ కేర్ రూమ్, ప్రార్థన గది వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ప్రత్యేక నిర్వహణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రద్దీ సమయాల్లో కోచ్‌ల పైకప్పుపై ప్రయాణికులు ప్రయాణించడం వల్ల ఏర్పడే అదనపు భారాన్ని తట్టుకునేలా పైకప్పు నిర్మాణాన్ని మరింత పటిష్ఠంగా రూపొందించారు.
మరో కీలక సాంకేతిక ప్రత్యేకతగా యూరోపియన్ ప్రామాణికం ఈఎన్ 15227కు అనుగుణంగా ఢీకొన్న సందర్భాల్లో భద్రతను పెంచే క్రాష్‌వర్తీ డిజైన్ నిబంధనలను ఈ కోచ్‌లలో ప్రవేశపెట్టారు. ఇందుకోసం ఢీకొన్నప్పుడు కోచ్ పనితీరు, ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేలా కోచ్ బాడీ షెల్‌ను సమగ్రంగా పునఃరూపకల్పన చేశారు. భారతీయ రైల్వే కోచ్‌లలో సాధారణంగా ఉపయోగించే 750 వోల్ట్ ల విద్యుత్ వ్యవస్థకు బదులుగా, ఈ కోచ్‌ల విద్యుత్ వ్యవస్థను 415 వోల్ట్ ల ఆపరేషన్‌కు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించారు.
ఆర్‌సీఎఫ్ (రైల్ కోచ్ ఫ్యాక్టరీ), బంగ్లాదేశ్ రైల్వే మధ్య భాగస్వామ్యం 2015-16లో 120 ఎల్‌హెచ్‌బీ బ్రాడ్‌గేజ్ ప్రయాణికుల కోచ్‌లను విజయవంతంగా సరఫరా చేయడంతో ప్రారంభమైంది. ఈ విజయవంతమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ, 2024లో బంగ్లాదేశ్ రైల్వే మరోసారి రైట్స్ ద్వారా ఆర్‌సీఎఫ్‌కు ప్రతిష్ఠాత్మక ఆర్డర్‌ను అప్పగించింది. ఇందులో ఏడు రకాల వైవిధ్యాలలో 200 బ్రాడ్‌గేజ్ ప్రయాణికుల కోచ్‌లను తయారు చేసి సరఫరా చేయాల్సి ఉంది.
***
(रिलीज़ आईडी: 2297978)
आगंतुक पटल : 40