రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

తదుపరి తరం తీర ప్రాంత గస్తీ నౌక ప్రారంభం


కోల్‌కతాలోని (యార్డ్ 3037, శృతి) M/s జీఆర్ఎస్ఈ వేదికగా కార్యక్రమం

प्रविष्टि तिथि: 11 AUG 2026 7:40PM by PIB Hyderabad

వార్‌షిప్ ప్రొడక్షన్ - అక్విజిషన్ కంట్రోలర్ వైస్ అడ్మిరల్ సంజయ్ సాధు, శ్రీమతి మనికా సాధు ఈ రోజు కోల్‌కతాలోని జీఆర్ఎస్ఈ వద్ద 'యార్డ్ 3037 (శృతి)' వేదికగా తదుపరి తరం తీరప్రాంత గస్తీ నౌక (ఎన్‌జీవోపీవీ)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారత నౌకాదళ గొప్ప సాంప్రదాయాలు, విలువలను ప్రతిబింబించింది. భారత నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖ, జీఆర్ఎస్ఈలకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎన్‌జీవోపీవీల నిర్మాణం రెండు షిప్‌యార్డులలో (జీఎస్ఎల్, గోవా.. జీఆర్ఎస్ఈ, కోల్‌కతా) ఏకకాలంలో జరుగుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, నిర్మించిన ఈ నౌకలు... సముద్ర నిఘా, శోధన, రక్షణ, తీరప్రాంత ఆస్తుల రక్షణ, హెచ్ఏడీఆర్, యాంటీ-పైరసీ మిషన్ల వంటి బహుళ రంగ కార్యకలాపాల కోసం ప్రస్తుతం ఉన్న ఓపీవీలు/ఎన్‌వోపీవీలను బలోపేతం చేస్తాయి. ఈ నౌకల కోసం గొప్పదైన భారత వారసత్వం నుంచి పేర్లను ఎంపిక చేశారు. నాలుగు వేదాలను సూచిస్తూ ఈ నౌకకు 'శృతి' అని పేరు పెట్టారు. నౌక పైభాగంలోని డిజైన్‌లో ఉర్సా మేజర్ నక్షత్రరాశిని, ఎరుపు - తెలుపు రంగులతో లైట్‌హౌస్‌నూ చిత్రించారు.

ఈ నౌక ప్రయోగం స్వదేశీ నౌకా నిర్మాణంలో భారత నౌకాదళం సాధిస్తున్న మరో కీలక మైలురాయిని సూచిస్తుంది. ఇది భారత ప్రభుత్వ ‘స్వయం-సమృద్ధ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాల లక్ష్యాలకు అనుగుణంగా ఉంది.

 

***


(रिलीज़ आईडी: 2297977) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Marathi , Punjabi , Tamil