ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథను ఆగస్టు 12న ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి


ఆత్మకథ శీర్షిక: "ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్"

प्रविष्टि तिथि: 11 AUG 2026 1:22PM by PIB Hyderabad

భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ "ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్మై లైఫ్మై స్ట్రగుల్స్శీర్షికతో ఉన్న పుస్తకాన్ని ఆగస్టు 12, 2026న ఉదయం 9:30 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.

భారత్‌లోని విశిష్టమైన ప్రముఖుల్లో ఒకరి జీవితాన్నిదేశానికి ఆయన అందించిన సేవలను వేడుకగా జరుపుకునే ప్రత్యేక కార్యక్రమమే ఈ పుస్తకావిష్కరణమాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ అసాధారణ జీవిత ప్రయాణాన్ని ఈ ఆత్మకథ వివరిస్తుందిబాల్యంలోని రోజులనుఆయన ఎదుర్కొన్న సవాళ్లనుసాధించిన విజయాలనుప్రజా జీవితాన్నిదేశ 14వ రాష్ట్రపతిగా అందించిన సేవలను ఈ పుస్తకం తెలియజేస్తుందిఆయన ప్రయాణంప్రజాసేవను తీర్చిదిద్దిన నైతిక విలువలుఅనుభవాలుపరిస్థితులను వివరిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2297569) आगंतुक पटल : 63
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Bengali , Bengali-TR , Odia , English , Manipuri , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam