నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
శిలాజేతర ఇంధన విద్యుత్ సామర్థ్యంలో 300 జీడబ్ల్యూ సాధించి కీలక దశకు చేరుకున్న భారత్
నాడు పోస్టు చేయడమైనది:
09 AUG 2026 2:31PM by PIB Hyderabad
స్వచ్ఛ ఇంధనం దిశగా దేశ మార్పు, వాతావరణ లక్ష్యాల సాధనలో భాగంగా జూలై 31, 2026 నాటికి శిలాజేతర ఇంధన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో భారత్.. 300 జీడబ్ల్యూతో కీలక ఘట్టాన్ని అధిగమించింది. 2030 నాటికి నిర్దేశించిన 500 జీడబ్ల్యూ లక్ష్యంలో ఇది 60 శాతానికి పైగా ఉంది.
శిలాజేతర ఇంధన సామర్థ్య వివరాలు (31.07.2026 నాటికి):
-
సౌర విద్యుత్: 164.59 జీడబ్ల్యూ
-
పవన విద్యుత్: 58.14 జీడబ్ల్యూ
-
జల విద్యుత్ (భారీ, చిన్న): 57.24 జీడబ్ల్యూ
-
బయో పవర్: 11.75 జీడబ్ల్యూ
-
అణు విద్యుత్: 8.78 జీడబ్ల్యూ
-
మొత్తం శిలాజేతర ఇంధన సామర్థ్యం: 300.50 జీడబ్ల్యూ
దేశంలోని మొత్తం విద్యుత్త్ ఉత్పత్తి సామర్థ్యంలో (ప్రస్తుతం ఇది దాదాపుగా 552 జీడబ్ల్యూ ఉంది) శిలాజేతర ఇంధన విద్యుత్ సామర్థ్యం వాటా 54 శాతానికి పైగా ఉంది.
ఆత్మనిర్భర్ ఇంధన వ్యవస్థ దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని.. ప్రభుత్వ కీలక విధానపరమైన ప్రోత్సాహకాల ద్వారా సాధించిన ఈ కీలక ఘట్టం స్పష్టం చేస్తోంది. 2030 నాటికి 500 జీడబ్ల్యూ శిలాజేతర ఇంధన సామర్థ్య లక్ష్యం దిశగా సాగుతున్న పురోగతిని ఇది తెలియజేస్తుంది.
వివిధ రంగాల సహకారంతో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిలో వృద్ధి బలోపేతం అవుతుంది. 2014లో కేవలం 2.8 జీడబ్ల్యూగా ఉన్న సౌర విద్యుత్, ప్రస్తుతం సుమారు 165 జీడబ్ల్యూకు చేరుకుని కీలక వృద్ధి శక్తిగా నిలిచింది. పవన విద్యుత్ రంగం కూడా బలాన్ని పుంజుకుని 21 జీడబ్ల్యూ నుంచి 58 జీడబ్ల్యూకు పైగా చేరుకుంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలో రికార్డు స్థాయిలో 55.29 జీడబ్ల్యూ శిలాజేతర ఇంధన విద్యుత్ సామర్థ్యాన్ని నెలకొల్పారు. ఇందులో 44.6 జీడబ్ల్యూ సౌర విద్యుత్, 6 జీడబ్ల్యూ పవన విద్యుత్ కీలకంగా నిలిచాయి.
పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో సాధించిన వేగవంతమైన పురోగతి… దేశంలోని పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలోనూ కనిపిస్తోంది. ఇది 2014-15 లో 190.96 బీయూ నుంచి 2025-26 నాటికి 477.79 బీయూకి చేరింది.
ఈ వేగవంతమైన వృద్ధికి మద్దతిస్తూ, సరఫరా వ్యవస్థలో స్వయంసమృద్ధిని సాధించేందుకు దేశీయ తయారీ సామర్థ్యాలను భారత్ గణనీయంగా మెరుగుపరచుకుంది. అత్యంత సామర్థ్యంతో, దేశీయంగా తయారైన సోలార్ మాడ్యూళ్లపై దృష్టి సారించిన ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం ద్వారా ఇది సాధ్యమైంది. సోలార్ పీవీ మాడ్యూళ్ల కోసం ఉద్దేశించిన అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఏఎల్ఎంఎం)లోనమోదైన ఉత్పాదక సామర్థ్యం.. 2014లో 2.3గా ఉండగా, నేడు 200 జీడబ్ల్యూతో కీలక దశకు చేరుకుంది.
స్వచ్ఛ ఇంధన మార్పు కేవలం వాతావరణానికి ఇచ్చే ప్రాముఖ్యత మాత్రమే కాదు… భారతదేశ పారిశ్రామిక పోటీతత్వం, ఇంధన స్వయంప్రతిపత్తి, ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పటంలో కీలకమైనది.
పారిశ్రామిక రంగంలో కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. దీనిద్వారా గ్రీన్ హైడ్రోజన్, దాని ఉత్పత్తుల ఉత్పాదకత, వినియోగం, ఎగుమతిలో ప్రపంచ కేంద్రంగా భారత్‌ను నిలిపేందుకు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను అమలు చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2297125)
సందర్శకుల సూచీ సంఖ్య : : 81