రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

2026 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భారత వైమానిక దళ బ్యాండ్ ప్రదర్శన

प्रविष्टि तिथि: 08 AUG 2026 2:50PM by PIB Hyderabad

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని... న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్పరం యోధా స్థల్ వద్ద పబ్లిక్ ప్లాజాలో ఆగస్టు 9, 2026న సాయంత్రం 5:00 గంటల నుంచి 6:00 గంటల వరకు భారత వైమానిక దళ బ్యాండ్ ప్రదర్శన జరుగుతుందిజాతీయ గేయం 'వందేమాతరం' 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ... ప్రజల భాగస్వామ్యంతో దేశభక్తినిజాతీయ గౌరవాన్ని పెంపొందించటమే ఈ సంగీత ప్రదర్శన ఉద్దేశం.

వేదికపై ప్రదర్శన ఇచ్చేందుకు 32 మంది వైమానిక దళ సైనికులు, 8 మంది అగ్నివీర్‌వాయు (ముగ్గురు మహిళలతో సహాసంగీతకారుల బృందం సిద్ధంగా ఉందిప్రేక్షకులకు మరువలేని అనుభూతిని కలిగించేలా ఈ సంగీతకారులు ప్రదర్శన ఇవ్వనున్నారుదేశభక్తిమనసును హత్తుకునే పాటలతో శక్తిమంతమైన ప్రదర్శన ద్వారా ఐఏఎఫ్ బ్యాండ్ దేశభక్తి భావాలను మరింత పెంచుతుంది.

ఈ కార్యక్రమానికి ప్రధాన సంగీత దర్శకుడిగా మాస్టర్ వారెంట్ ఆఫీసర్ ఎశ్రీహరి వ్యవహరిస్తారుజూనియర్ వారెంట్ ఆఫీసర్ మూన్ దేకాజూనియర్ వారెంట్ ఆఫీసర్ అభిషేక్ పాల్సర్జెంట్ ఎన్‌టీ సింగ్‌ ఆయనకు సహాయకులుగా ఉంటారు.

 

***


(रिलीज़ आईडी: 2296632) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Tamil