సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
నూతన అంతర్జాతీయ భాగస్వామ్యాలు, సహకార ఒప్పందాలతో ముగిసిన బ్రిక్స్ వేవ్స్ బజార్ 2026
బ్రెజిల్‌కు చెందిన రియోఫిల్మ్, రష్యాకు చెందిన గోస్‌ఫిల్మోఫోండ్ లతో ఆడియో విజువల్ భాగస్వామ్యాన్ని
ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
నాడు పోస్టు చేయడమైనది:
07 AUG 2026 5:10PM by PIB Hyderabad
ముంబయి, 7 ఆగస్ట్ 2026: సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ) ముంబయిలో నిర్వహించిన బ్రిక్స్ వేవ్స్ బజార్ - 2026 రెండు రోజులపాటు ఉన్నతస్థాయి పరిశ్రమల స్థాయి చర్చలు, వ్యాపార అనుసంధానం, అంతర్జాతీయ భాగస్వామ్య కార్యక్రమాలతో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాలకు చెందిన 20 దేశాల ప్రతినిధులు పాల్గొని సృజనాత్మక రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేశారు.
బ్రిక్స్ వేవ్స్ బజార్ - 2026లో 900 మందికి పైగా పరిశ్రమ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మాతలు, స్టూడియోలు, ప్రసార సంస్థలు, ఫిల్మ్ కమిషన్లు, ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్) రంగ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, సాంకేతిక సంస్థలు, సృజనాత్మక సంస్థల మధ్య 275కు పైగా ఎంపిక చేసిన బిజినెస్ - టు - బిజినెస్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలు, చర్చలు బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల మధ్య కొత్త సహ నిర్మాణాలు, వ్యాపార భాగస్వామ్యాలు, సంస్థాగత సహకారాలు, దీర్ఘకాలిక సృజనాత్మక పరస్పర మార్పిడికి బలమైన పునాదులు వేశాయి.
బ్రిక్స్ వేవ్స్ బజార్ ఫలితాల గురించి నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ మగ్దూమ్ మాట్లాడుతూ “బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల మధ్య సృజనాత్మక సహకారానికి గల అపార అవకాశాలను బ్రిక్స్ వేవ్స్ బజార్ చాటిచెప్పింది. ఇక్కడ ప్రారంభమైన భాగస్వామ్యాలు, చర్చలు మరింత బలమైన సహనిర్మాణాలు, వ్యాపార సహకారాలు, సృజనాత్మక పరస్పర మార్పిడికి నాంది పలికాయి. ప్రపంచ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే శాశ్వత వారధులను నిర్మించేందుకు వేవ్స్ వేదిక ద్వారా భారత్ తన నిబద్ధతను కొనసాగిస్తుంది” అని తెలిపారు.
ముఖ్య ప్రకటనలు - అంతర్జాతీయ భాగస్వామ్యాలు
బ్రిక్స్ వేవ్స్ బజార్ అనేక కీలకమైన అంతర్జాతీయ భాగస్వామ్యాలకు వేదికగా నిలిచింది. ఇవి బిజినెస్ - టు - బిజినెస్ ఒప్పందాలు, అంగీకార లేఖలు (ఎల్ఓఐ), అవగాహనా ఒప్పందాలు, సరిహద్దుల వెలుపల వ్యాపార ప్రకటనల రూపంలో జరిగాయి. వాటిలో ముఖ్యమైనవి
-
ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ మగ్దూమ్, బ్రెజిల్‌కు చెందిన రియో ఫిల్మ్ కమిషన్ అధిపతి డేనియల్ సెల్లీ మధ్య అంగీకార లేఖ (లెటర్ ఆఫ్ ఇంటెంట్ - ఎల్ఓఐ) మార్పిడి జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ఎన్ఎఫ్‌డీసీ–రియోఫిల్మే మధ్య ఆడియో, విజువల్ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు, వేవ్స్ - 2027లో బ్రెజిల్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించనున్నారు. ఈ చర్య భారత్, బ్రెజిల్ మధ్య సృజనాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది.
బ్రిక్స్ వేవ్స్ బజార్ - 2026 సందర్భంగా ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ మగ్దూమ్, బ్రెజిల్‌కు చెందిన రియో ఫిల్మ్ కమిషన్ అధిపతి డేనియల్ సెల్లీ ఇరు సంస్థల మధ్య ఆడియో, విజువల్ రంగంలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను మార్చుకున్న చిత్రం
-
ఎన్ఎఫ్‌డీసీ - ఎన్ఎఫ్ఏఐ రష్యాకు చెందిన గోస్‌ఫిల్మోఫోండ్‌తో కొనసాగుతున్న తమ సహకారాన్ని ప్రకటించాయి. ఎఫ్ఐఏఎఫ్ సభ్యత్వం కలిగిన ఈ రెండు ఫిల్మ్ ఆర్కైవ్ సంస్థలు చలనచిత్రాలను భద్రపరిచే రంగంలో పరస్పర సహకారాన్ని మరింత అధికారికంగా బలోపేతం చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి.
-
దక్షిణాఫ్రికా, రష్యా, థాయ్‌లాండ్, కజకిస్థాన్ దేశాల పరిశ్రమ ప్రతినిధులు గ్లోబల్ సౌత్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2027 నిర్వహణ ప్రతిపాదనను ప్రకటించారు. అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక ఆర్థిక వ్యవస్థల మధ్య సాంస్కృతిక, సినీ రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం ఈ ఉత్సవం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
-
మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఈఏఐ), వియత్నాంకు చెందిన సంస్కృతి, క్రీడలు, పర్యాటక మంత్రిత్వశాఖ సినీ విభాగం చలనచిత్ర రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, అధికారిక ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకునే దిశగా ముందుకు సాగేందుకు రికార్డ్ ఆఫ్ మీటింగ్ ను ప్రకటించాయి.
-
పరిశ్రమల భాగస్వామ్యాలు, కంటెంట్ సృష్టి, విద్యా కార్యక్రమాలు, ఆవిష్కరణలు, వాణిజ్యీకరణ (మానిటైజేషన్), ప్రతిభాభివృద్ధి వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ), గ్రాఫిటీ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
-
బ్రెజిల్‌కు చెందిన మీడియా వేదిక - ది సౌత్ గ్లోబల్ న్యూస్ - బ్రిక్స్ దేశాలతో పాటు విస్తృత గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సమాచార ప్రసారం, మీడియా సహకారం, సాంస్కృతిక పరస్పర మార్పిడిని బలోపేతం చేసే కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది.
-
భారత్, పోర్చుగల్ ఉమ్మడి నిర్మాణంలో రూపొందనున్న ఫీచర్ ఫిల్మ్ ‘పోర్చుగీస్ మ్యాన్ - ఓ వార్’ ను ప్రకటించారు. ఈ చిత్ర నిర్మాణంలో భారత్, బ్రెజిల్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన భాగస్వాములు, సహ నిర్మాతలు కలిసి పనిచేయనున్నారు.
-
కార్టినా ఎంటర్‌టైన్‌మెంట్, వేగా ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారత్ -రష్యా సహ నిర్మాణ చిత్రం ‘కొరోవా’ను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇరు దేశాల మధ్య సృజనాత్మక సహకారం మరింత బలోపేతం కానుంది.
-
చెక్ రిపబ్లిక్‌కు చెందిన మూవీ ఎస్.ఆర్.ఓ.నిర్మాణ సంస్థ, భారత్‌కు చెందిన సినిమా4గుడ్ కలిసి టోమాస్ బాటా జీవితంపై అంతర్జాతీయ చారిత్రక ఇతిహాస చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టులో భారత్, చెక్ రిపబ్లిక్, చైనా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాలకు చెందిన భాగస్వాములు కలిసి పనిచేయనున్నారు.
-
భారత్‌లో కాలివిజన్ ఏఐ స్టూడియో ప్రారంభిస్తున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన ఎన్ కోర్ ఐఎన్సీ, యూఏఈకి చెందిన విజన్ ఎక్స్ సంస్థలు ప్రకటించాయి. సినిమా, కథనాల రూపకల్పన కోసం కృత్రిమ మేధ ఆధారిత కంటెంట్ నిర్మాణ స్టూడియోగా ఇది పనిచేయనుంది.
-
పరిశ్రమ ప్రముఖులు బ్రిక్స్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ అలయన్స్ (బీఐపీఏ) ను ఆవిష్కరించారు. సహకారం, పెట్టుబడులు, విద్య, ఆవిష్కరణల ద్వారా బ్రిక్స్ దేశాల నిర్మాతలను అనుసంధానించే శాశ్వత అంతర్జాతీయ వేదికగా దీనిని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
-
కొత్త ప్రీమియం మైక్రో డ్రామా వేదిక - క్లిప్ - తన సృజనాత్మక దృక్పథంతో పాటు త్వరలో విడుదల చేయనున్న ప్రాజెక్టుల వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈటీవీ టెలివిజన్ ప్రసారం కోసం రూపొందిస్తున్న తన కొత్త భారతీయ అనిమే సిరీస్ పోస్టర్‌ను ఆవిష్కరించింది.
-
గేమ్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (జీడీఏఐ), మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కామిక్స్ అసోసియేషన్ లతో అస్సాం ఏవీజీసీ - ఎక్స్ఆర్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా గేమ్ అభివృద్ధి, కామిక్స్ రంగం, అంతర్జాతీయ మార్కెట్ లభ్యత, మేధోసంపత్తి పంపిణీ వంటి అంశాలను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
-
వైభవి స్టూడియోస్ తమ రాబోయే అనిమే ఫీచర్ ఫిల్మ్ ‘ట్రియో’ను అధికారికంగా ప్రకటించింది.
-
ఇండియన్ కామిక్స్ అసోసియేషన్, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కలసి అంతర్జాతీయ సహకారం, ప్రతినిధి బృందాల పరస్పర మార్పిడి, అంతర్జాతీయ మార్కెట్ లభ్యత, మేధోసంపత్తి పంపిణీని ప్రోత్సహించేందుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
విజయవంతంగా ముగిసిన బ్రిక్స్ వేవ్స్ బజార్ - 2026 బ్రిక్స్ దేశాల మధ్య సృజనాత్మక ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసే మరో కీలక ఘట్టంగా నిలిచింది. ప్రభుత్వాలను, పరిశ్రమల ప్రముఖులను, సృజనకారులను, పెట్టుబడిదారులను, వివిధ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా సుస్థిర అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహించాలన్న భారత్ నిబద్ధతను ఈ బజార్ మరోసారి చాటిచెప్పింది. సాంస్కృతిక దౌత్యం, ఆర్థికాభివృద్ధికి సృజనాత్మక పరిశ్రమలను ప్రధాన చోదకంగా తీర్చిదిద్దే దిశగా భారత్ కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.
సృజనాత్మక పరిశ్రమల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక వేదికగా ఈ రెండు రోజుల కార్యక్రమం కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి, సహ నిర్మాణ అవకాశాలను పరిశీలించడానికి, విజ్ఞానాన్ని మార్పిడి చేసుకోవడానికి బ్రిక్స్ దేశాల వ్యాప్తంగా సాంస్కృతిక, సృజనాత్మక సహకారాన్ని బలోపేతం చేయడానికి చలనచిత్ర, టెలివిజన్, ఏవీజీసీ- ఎక్స్ఆర్ గేమింగ్, యానిమేషన్, మీడియా, డిజిటల్ కంటెంట్ రంగానికి చెందిన ప్రముఖులకు ఒక మార్గదర్శకంగా నిలిచింది.
***
(రిలీజ్ ఐడి: 2296438)
సందర్శకుల సూచీ సంఖ్య : : 38