యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
మై భారత్ ద్వారా యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. డిజిటల్ వేదికలో 2.46 కోట్లకు పైగా రిజిస్ట్రేషనలు
కృత్రిమ మేధ ఆధారిత సీవీ బిల్డర్, అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమాలు, సీఎస్‌సీ అనుసంధానం ద్వారా యువతకు అపార అవకాశాలు
प्रविष्टि तिथि:
06 AUG 2026 4:19PM by PIB Hyderabad
మై భారత్ వేదిక ద్వారా దేశంలో యువత సాధికారతను బలోపేతం చేసేందుకు కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. కృత్రిమ మేధ ఆధారిత డిజిటల్ సేవలు, అనుభవపూర్వక అభ్యాస అవకాశాలు, గ్రామీణ, సుదూర ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల ద్వారా యువతకు కొత్త అవకాశాలను అందిస్తోంది. ఈ వేదిక ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 2.46 కోట్లకు పైగా యువత తమ పేర్లను నమోదు చేసుకోగా, 1.22 లక్షలకు పైగా మంది దాదాపు 25,000 అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమాల్లో చేరారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా నమోదైన వివరాలను అనుబంధంలో పొందుపరిచారు.
యువతకు సాంకేతిక చేయూతనందించేందుకు ఈ వేదికలో ఏఐ ఆధారిత సీవీ బిల్డర్ వంటి అత్యాధునిక ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఆకాంక్షాత్మక జిల్లాల్లోని యువతకు స్వచ్ఛంద సేవలు, నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్షిప్లు, నాయకత్వ అవకాశాలను సులభంగా అందించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 780కి పైగా జిల్లా యువజన కార్యాలయాలు, ఉమ్మడి సేవా కేంద్రాల (కామన్ సర్వీస్ సెంటర్లు-సీఎస్‌సీ) వ్యవస్థను మంత్రిత్వ శాఖ సమర్థవంతంగా వినియోగిస్తోంది.
మై భారత్ వేదిక ద్వారా దేశంలోని యువతకు వివిధ రంగాలలో కేంద్ర ప్రభుత్వం ప్రాక్టికల్ శిక్షణను అందిస్తుంది. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, భాగస్వామ్య సంస్థల సహకారంతో అనుభవపూర్వక అభ్యసన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ వేదిక ద్వారా తపాలా శాఖ, జన్ ఔషధి, సేవా సే సీఖేన్, ప్రజా పంపిణీ వ్యవస్థ, సడక్ సురక్ష మిత్ర, రేడియో ప్రొడక్షన్, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, వయోవృద్ధుల సంరక్షణ కేంద్రాలు, సెమీకండక్టర్ శిక్షణ కార్యక్రమ వంటి అనేక రంగాల్లో స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమాలు వివిధ రంగాల్లో 20 నుంచి 360 గంటల వ్యవధితో స్వల్పకాలిక ప్రాక్టికల్ శిక్షణ అవకాశాలను అందిస్తాయి. మై భారత్ వేదిక ప్రారంభమైనప్పటి నుంచి 1.22 లక్షల మందికి పైగా యువత దాదాపు 25,000 అనుభవాత్మక అభ్యసర కార్యక్రమాల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మై భారత్ వేదిక ద్వారా డిజిటల్ ధ్రువీకరణ కలిగిన పత్రాలను జారీ చేశారు.
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యువతకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు మై భారత్ వేదికగా ప్రత్యేక స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2026 జూలై 16 నాటికి మై భారత్ వేదిక ద్వారా నమోదు, దరఖాస్తు ప్రక్రియ కోసం 98,632 మంది యువత పీఎంఐఎస్ వేదికకు మళ్లించారు.
మై భారత్ వేదికలో డిజిటల్ సేవల పంపిణీని మెరుగుపరచడానికి కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగిస్తున్నారు. పనితీరును, సేవా ప్రమాణాలను పెంపొందించేందుకు సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, డాక్యుమెంటేషన్, సమాచార నిర్వహణ, కార్యక్రమాల పర్యవేక్షణలో ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకించి భాషిణి భాగస్వామ్యంతో యువత కోసం కృత్రిమ మేధ ఆధారిత సీవీ బిల్డర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, ఆకాంక్షాత్మక జిల్లాల్లోని యువతకు సేవలను చేరువ చేసేందుకు ప్రభుత్వం ఫిజిటల్ (భౌతిక+డిజిటల్) విధానాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 780కి పైగా జిల్లా యువజన కార్యాలయాల వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. యువజన క్లబ్లు, విద్యాసంస్థలు, ఎన్ఎస్ఎస్ విభాగాలు, ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార భాగస్వామ్యాలతో కలిసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. డిజిటల్ సదుపాయాలు లేని గ్రామీణ, సుదూర ప్రాంతాల యువతకు సహాయపడేందుకు మై భారత్ వేదిక ఉమ్మడి సేవా కేంద్రాల వ్యవస్థతో అనుసంధానించారు. దీనివల్ల గ్రామస్థాయి పారిశ్రామికవేత్తల సాయంతో యువత సులభంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. జిల్లా, మండల, పంచాయతీ, గ్రామ స్థాయిల్లో లోకేషన్ ఆధారిత స్వచ్ఛంద సేవలు, అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమాలను ఈ వేదిక ద్వారా అందిస్తున్నారు. దీనివల్ల యువత తమ నివాస ప్రాంతాలకు దగ్గరలోనే ఉన్న అవకాశాలలో పాల్గొంటూ నాయకత్వ పటిమను, సమాజ సేవను పెంపొందించుకుంటున్నారు.
అనుబంధం
రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా మై భారత్ వేదికలో నమోదు వివరాలు
|
రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం
|
మొత్తం నమోదు సంఖ్య
|
|
అండమాన్, నికోబార్ దీవులు
|
28794
|
|
ఆంధ్రప్రదేశ్
|
814350
|
|
అరుణాచల్ ప్రదేశ్
|
46277
|
|
అస్సాం
|
646655
|
|
బిహార్
|
691531
|
|
చండీగఢ్
|
77271
|
|
చత్తీస్‌గఢ్
|
565384
|
|
ఢిల్లీ
|
680862
|
|
గోవా
|
52322
|
|
గుజరాత్
|
928092
|
|
హర్యానా
|
755169
|
|
హిమాచల్ ప్రదేశ్
|
303408
|
|
జమ్ము, కశ్మీర్
|
862526
|
|
జార్ఖండ్
|
346639
|
|
కర్ణాటక
|
817057
|
|
కేరళ
|
586790
|
|
లడఖ్
|
39653
|
|
లక్ష్యదీప్
|
6452
|
|
మధ్యప్రదేశ్
|
1432089
|
|
మహారాష్ట్ర
|
1518436
|
|
మణిపూర్
|
42648
|
|
మేఘాలయ
|
50376
|
|
మిజోరాం
|
69977
|
|
నాగాలాండ్
|
45104
|
|
ఒడిశా
|
592246
|
|
పుదుచ్చేరి
|
85275
|
|
పంజాబ్
|
625705
|
|
రాజస్థాన్
|
2039230
|
|
సిక్కిం
|
47643
|
|
తమిళనాడు
|
1502286
|
|
తెలంగాణ
|
403426
|
|
దాద్రా నగర్ హవేలీ
|
23005
|
|
త్రిపుర
|
123306
|
|
ఉత్తర ప్రదేశ్
|
2506907
|
|
ఉత్తరాఖండ్
|
317906
|
|
పశ్చిమ బెంగాల్
|
849514
|
|
రాష్ట్రం పేరు లేదు
|
4127831
|
|
మొత్తం
|
24652142
|
ఈ సమాచారాన్ని గురువారం రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 2295756)
आगंतुक पटल : 4