రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
వాహనాల మధ్య సమాచార వ్యవస్థ
प्रविष्टि तिथि:
03 AUG 2026 1:20PM by PIB Hyderabad
మోటారు వాహనాల మధ్య (వీ2వీ) సమాచార వ్యవస్థలను దశల వారీగా అమలు చేయడానికి కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989కి సవరణలు ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా ప్రకటనను విడుదల చేసింది.
వాహనాల మధ్య, ఇతర సాంకేతిక ఆధారిత రవాణా వ్యవస్థ అప్లికేషన్ల కోసం 5.875 గిగాహెర్ట్జ్ నుంచి 5.925 గిగాహెర్ట్జ్ బ్యాండ్ విడ్త్ ఫ్రీక్వెన్సీని పరిశీలించారు. టెలికమ్యూనికేషన్ల విభాగం 10 జూన్ 2026 నాటి జీ.ఎస్.ఆర్ 466(ఈ) ద్వారా ఈ ఫ్రీక్వెన్సీ పరిధి వినియోగానికి సంబంధించిన లైసెన్సింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది.
సమీపంలోని వాహనాలు వాటి వేగం, స్థానం, ప్రయాణ దిశ, యాక్సిలరేషన్ మొదలైన తక్షణ వివరాలను ఒకదానితో ఒకటి ఇచ్చిపుచ్చుకునేందుకు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ సహాయపడుతుంది. అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, ముందున్న వాహనాన్ని ఢీకొట్టే ప్రమాదం, సురక్షితం కాని రీతిలో లైన్ మారడం, అత్యవసర వాహనాలు సమీపానికి రావడం వంటి భద్రతా పరమైన కీలక పరిస్థితుల్లో ఈ సమాచారం డ్రైవర్లకు లేదా వాహన వ్యవస్థలకు ముందస్తు హెచ్చరికలను అందిస్తుంది.
కేవలం వాహనంలో ఉండే సెన్సార్లు, డ్రైవర్ తక్షణ స్పందనపై మాత్రమే ఆధారపడే సాధారణ భద్రతా వ్యవస్థలతో పోలిస్తే వీ2వీ సాంకేతికత చాలా భిన్నమైనది. డ్రైవర్ కంటికి నేరుగా కనిపించని ప్రమాదకర పరిస్థితుల సమాచారాన్ని కూడా ఇది ముందే పసిగట్టి అందించగలదు. అందువల్ల ఇది అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థ (ఏడీఏఎస్) సాంకేతికతకు మరింత తోడ్పడుతూ.. ప్రమాదాలను ముందస్తుగా నివారించడానికి, వాహనాల అనుసంధానానికి, భవిష్యతత్తు స్మార్ట్ రవాణా వ్యవస్థల వినియోగానికి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం కింద పేర్కొన్న కాలపరిమితిని ప్రతిపాదించారు.
-
1 అక్టోబర్ 2027 నాటికి లేదా ఆ తర్వాత తయారై, వీ2వీ కమ్యూనికేషన్ వ్యవస్థలు కలిగిన ఎల్, ఎం, ఎన్ కేటగిరీ వాహనాలు తప్పనిసరిగా ఏఐఎస్-230 నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.
-
1 అక్టోబర్ 2028న లేదా ఆ తర్వాత 1 తయారయ్యే ఎల్, ఎం, ఎన్ కేటగిరీ వాహనాలన్నింటికీ ఏఐఎస్-230 నిబంధనలకు అనుగుణంగా వీ2వీ కమ్యూనికేషన్ వ్యవస్థలను తప్పనిసరిగా అమర్చాల్సి ఉంటుంది.
ఈ దశలవారీ విధానం వాహన తయారీదారులకు, ఇతర భాగస్వాములకు కొత్త నిబంధనల అమలుకు సిద్ధం కావడానికి తగినంత సమయాన్ని అందిస్తుంది.
భారతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలలో అమర్చే వీ2వీ సాంకేతిక వ్యవస్థలకు సంబంధించి కనీస సాంకేతిక, కార్యాచరణ, పనితీరు, పర్యావరణ, భద్రతా ప్రమాణాలను నిర్దేశిస్తూ ఏఐఎస్-230 ను రూపొందించారు.
ఈ నిబంధనలు 5.875 జీహెచ్‌జెడ్ నుంచి 5.925 జీహెచ్‌జెడ్ ఫ్రీక్వెన్సీ పరిధిలో సెల్యులార్ వెహికల్-టు-ఎవ్రీథింగ్ (సీ-వీ2ఎక్స్) సాంకేతికతను ఉపయోగించి, వాహనాల తయారీ సమయంలోనే కంపెనీలు అమర్చే ఆన్-బోర్డ్ యూనిట్లకు ఇవి వర్తిస్తాయి.
వీ2వీ సాంకేతిక వ్యవస్థ ప్రాథమిక అవసరాలు
-
రేడియో పనితీరు, ఫ్రీక్వెన్సీ స్థిరత్వం, అవుట్‌పుట్ విద్యుత్తు ప్రమాణాలు
-
సంకేతాలను స్వీకరించే సామర్థ్యం, ఎంపిక విధానం
-
ప్రపంచ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ (జీఎన్ఎస్ఎస్), లోకేషన్ గుర్తింపు వివరాలు
-
విద్యుత్ సరఫరా నిబంధనలు
-
విద్యుదయస్కాంత అంతరాయ నివారణ, అనుకూలత ప్రమాణాలు
-
సైబర్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్ భద్రతా నిబంధనలు
-
రోడ్డు భద్రతా అప్లికేషన్ల పనితీరు ప్రమాణాలు
దశలవారీగా అందుబాటులోకి వచ్చే భద్రతా ఫీచర్లు
దేశంలో వీ2వీ సాంకేతిక వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ వ్యవస్థ (ఐటీఎస్) అభివృద్ధి, అమలు కోసం మంత్రిత్వ శాఖ ఒక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసింది. రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి 5.9 జీహెచ్‌జెడ్ ఐటీఎస్/వీ2ఎస్ ఫ్రీక్వెన్సీ పరిధిని ఉపయోగించాలని ఆ టాస్క్ ఫోర్స్ సిఫార్సు చేసింది.
7 మే 2026న జరిగిన 56వ సమావేశంలో కేంద్ర మోటారు వాహనాల నిబంధనల సాంకేతిక స్థాయి కమిటీ కూడా ఏఐఎస్-230 రూపకల్పనను పరిశీలించింది. భారత్‌లో వీ2వీ సాంకేతిక వ్యవస్థల చట్టబద్ధమైన అమలుకు ఈ ప్రామాణికత సాంకేతిక బలాన్ని అందిస్తుంది.
ప్రతిపాదిత ఈ వ్యవస్థ వాహనాల చుట్టూ ఉన్న పరిస్థితులపై అవగాహనను పెంచుతుందని, సమయానికి భద్రతా హెచ్చరికలను అందిస్తుందని భావిస్తున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల ముప్పును తగ్గించడానికి అనుసంధానిత సాంకేతికతల వినియోగాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా.
ముసాయిదా నిబంధనలపై వచ్చే సూచనలు, అభిప్రాయాలను 30 రోజుల గడువు ముగిసిన తర్వాత పరిశీలిస్తారు. ఆ తర్వాతే తుది నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు.
***
(रिलीज़ आईडी: 2293808)
आगंतुक पटल : 16