ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ మహిళల బాక్సింగ్‌ 60 కిలోల విభాగంలో స్వర్ణం సాధించిన ప్రియా ఘంగాస్‌కు ప్రధానమంత్రి ప్రశంసలు

प्रविष्टि तिथि: 02 AUG 2026 12:56AM by PIB Hyderabad

   గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 మహిళల బాక్సింగ్ 60 కిలోల విభాగంలో స్వర్ణ పతక విజేత ప్రియా ఘంగాస్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ విజయం ఆమె అద్భుత నైపుణ్యాన్ని, మానసిక దృఢత్వాన్ని ప్రస్ఫుటం చేస్తున్నదని ఆయన కొనియాడారు.

భవిష్యత్తులోనూ ఆమె మరిన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ద్వారా పంపిన సందేశంలో:

“మహిళల బాక్సింగ్ 60 కిలోల విభాగంలో స్వర్ణ పతకంతో ప్రియా ఘంగాస్ అద్భుతం సాధించింది! ఆమె అసాధారణ నైపుణ్యానికి, మానసిక దృఢత్వానికి ఇది తిరుగులేని ఉదాహరణ. ప్రియా ఘంగాస్‌కు నా శుభాభినందనలు... భవిష్యత్తులోనూ మరింతగా రాణించాలని ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.




***************


MJPS/SS/ST


(रिलीज़ आईडी: 2293250) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Gujarati