ప్రధాన మంత్రి కార్యాలయం
కామన్‌వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో రజత పతక విజేత లవ్లీనా బోర్గ్‌హెయిన్‌కు ప్రధానమంత్రి ప్రశంస
నాడు పోస్టు చేయడమైనది:
02 AUG 2026 12:59AM by PIB Hyderabad
గ్లాస్గో కామన్‌వెల్త్ గేమ్స్-2026 మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన లవ్లీనా బోర్గ్‌హెయిన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఈ పోటీలో తొలి రౌండ్ నుంచే తన అద్భుత నైపుణ్యాన్ని, పట్టుదలను ఆమె చాటుకున్నదని ఆయన కొనియాడారు.
ఈ ఘనత సాధించడంపై అభినందిస్తూ- ఆమె అంకితభావం, నిలకడ దేశంలోని ఔత్సాహిక క్రీడాకారులకు సదా స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా పంపిన సందేశంలో:
“మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో లవ్లీనా బోర్గ్‌హెయిన్ సాధించిన రజత పతకం నాతోపాటు దేశ ప్రజానీకం హృదయాల్లో ఆనందోత్సాహాలు నింపింది. ఈ పోటీల్లో ఆదినుంచీ అపార నైపుణ్యంతో దూసుకెళ్తూ వచ్చిన ఆమెకు నా అభినందనలు. లవ్లీనా అంకితభావం, ప్రతిభా ప్రదర్వనలో నిలకడ దేశంలోని ఔత్సాహిక క్రీడాకారులకు సదా స్ఫూర్తినిస్తాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
**************
MJPS/SS/ST
(రిలీజ్ ఐడి: 2293249)
సందర్శకుల సూచీ సంఖ్య : : 43
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam