ప్రధాన మంత్రి కార్యాలయం
కామన్‌వెల్త్ గేమ్స్ పురుషుల బాక్సింగ్ 60 కిలోల విభాగంలో స్వర్ణ పతక విజేత సచిన్ శివచ్‌కు ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
02 AUG 2026 1:00AM by PIB Hyderabad
గ్లాస్గో కామన్‌వెల్త్ గేమ్స్-2026 పురుషుల బాక్సింగ్ 60 కిలోల విభాగంలో స్వర్ణ పతక విజేత సచిన్ శివచ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
సచిన్ శివచ్ సాధించిన ఈ ఘనత దేశంలోని అనేకమంది ఔత్సాహిక బాక్సింగ్ క్రీడాకారులలో నవ్యోత్తేజం నింపుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులోనూ అతడు మరెన్నో విజయాలు అందుకోవాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా పంపిన సందేశంలో:
“పురుషుల బాక్సింగ్ 60 కిలోల విభాగంలో సచిన్ శివచ్ విజయానికి నా హృదయపూర్వక అభినందనలు. అతని అసమాన ప్రతిభ దేశంలోని అనేక యువ బాక్సర్లలో నవ్యోత్తేజం నింపుతుందనడంలో సందేహం లేదు. భవిష్యత్తులోనూ యావద్దేశం గర్వించే విజయాలతో అతడు మరింతగా రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*************
MJPS/SS/ST
(రిలీజ్ ఐడి: 2293248)
సందర్శకుల సూచీ సంఖ్య : : 49
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam