ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘2026 కామన్వెల్త్ గేమ్స్’లో జూడోలో రజత పతక విజేత యామినీ మౌర్య.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 AUG 2026 8:45AM by PIB Hyderabad

‘2026 కామన్వెల్త్ గేమ్స్’.. 57 కేజీ జూడో కేటగిరీలో రజత పతకాన్ని గెలిచిన యామినీ మౌర్యను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
యామినీ మౌర్య చాలా గొప్ప ఆటను ప్రదర్శించారని, ఆమె ఆటతీరు జూడో అంటే ఆమెకు ఎంత మక్కువ ఉందో స్పష్టంగా తెలిపిందని ప్రధానమంత్రి ప్రశంసించారు.
యామినీ మౌర్య సాధించిన ఈ విజయం అనేక మంది యువత జూడో పట్ల ఆకర్షితులు కావడానికి స్ఫూర్తిని ఇస్తుందన్న విశ్వాసాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు. భావి ప్రయత్నాల్లోనూ యామినీ మౌర్య  అత్యుత్తమంగా రాణించాలని ప్రధానమంత్రి కోరుకుంటూ, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘జూడో 57 కేజీ కేటగిరీలో రజత పతకాన్ని గెలిచిన యామినీ మౌర్యకు అభినందనలు. ఆమె ఆటతీరు చాలా చక్కగా ఉంది. ఆమె ఆడిన తీరు చూస్తే, జూడో అంటే ఆమెకు ఎంత మక్కువ ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఆమె సాధించిన ఈ విజయం రాబోయే కాలంలో ఎంతో మంది యువత జూడో పట్ల ఆకర్షితులు అయ్యేటట్లు చేస్తుంది. రాబోయే కాలంలో కూడా అత్యుత్తమ ఆటతీరును  యామినీ మౌర్య  కనబరచాలని అభిలషిస్తూ, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2293134) సందర్శకుల సూచీ సంఖ్య : : 46