రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎక్స్‌ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిలును ఆవిష్కరించిన ఆర్మీ చీఫ్

నాడు పోస్టు చేయడమైనది: 31 JUL 2026 2:18PM by PIB Hyderabad

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఎక్స్‌ట్రీమ్ వెదర్ గ్రేడ్ (ఎక్స్‌డబ్ల్యూజీడీజిలును సైనిక దళాల ప్రధానాధికారి (సీవోఏఎస్జనరల్ ధీరజ్ సేథ్ ఈ రోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించారుభారత ఆర్మీచమురు మార్కెటింగ్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన ఈ ప్రత్యేక ఇంధనం.. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో రక్షణరవాణా వాహనాల గమనాన్నిభద్రతనుకార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందిఅత్యంత ఎత్తయిన ప్రాంతాలుఅత్యంత శీతల ప్రాంతాల్లో ఈ టెక్నాలజీకి విస్తృతమైన పౌర ప్రయోజనాలున్నాయిఅలాగే ఆత్మనిర్భర భారత్ దిశగా సాధించిన ముఖ్యమైన విజయాన్ని సూచిస్తుంది.

అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద సాధారణ డీజిలు చిక్కగా మారిఇంధన ఫిల్టర్లను మూసుకుపోయేలా చేస్తుందిఫలితంగా అధిక ఎత్తుల్లోమంచు ప్రాంతాల్లో వాహనాల పనితీరు ప్రభావితమవుతుందిఈ సవాలును ఎక్స్‌డబ్ల్యూజీ డీజిల్ అధిగమిస్తుందిమైనస్ 42 డిగ్రీల సెల్సియస్ లాంటి అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద సైతం ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందిబీఎస్-VI ప్రమాణాలుఐఎస్ 1460:2025 ప్రత్యేకతలకు అనుగుణంగా ఉండటంతో.. సైన్యంలో ఇప్పటికే వినియోగిస్తున్న పాత వాహనాల్లో సైతం దీనిని ఉపయోగించవచ్చుదీనికోసం ఎలాంటి ఇంజిన్ మార్పులు లేదా రీ-హోమోలోగేషన్ అవసరం లేదు.

ఈ సందర్భంగా సీవోఏఎస్ ప్రసంగించారుఅత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో రవాణాకార్యాచరణ సన్నద్ధతమిషన్ విశ్వసనీయతను మెరుగుపరిచే విప్లవాత్మక స్వదేశీ ఆవిష్కరణగా ఎక్స్‌డబ్ల్యూజీ డీజిలును వర్ణించారుతీవ్రమైన చలికాలాల్లో వాహనాలు పనిచేయడానికి గతంలో అనుసరించిన పద్ధతులను ఈ ఇంధనం తొలగిస్తుందన్నారుతద్వారా సిబ్బంది భద్రతమనోధైర్యం మెరుగుతుందని వెల్లడించారుఏడాది వ్యవధిలోనే పరిష్కారాన్ని అభివృద్ధి చేసిన భారత ఆర్మీ బృందంచమురు మార్కెటింగ్ సంస్థలను సీవోఏఎస్ అభినందించారుఅలాగే ఈ భాగస్వామ్యం... వైవిధ్యమైన కార్యాచరణ అవసరాల కోసం ప్రత్యేకమైన ఇంధనాలను రూపొందిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

సైనికపరమైన అవసరాలకు మాత్రమే కాకుండా... కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే వాహనాలుపరికరాల విశ్వసనీయతనుభద్రతను మెరుగుపరిచి అత్యంత ఎత్తయినఅత్యల్ప ఉష్ణోగ్రతలున్న ప్రదేశాల్లో నివసించే పౌరులకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2292571) సందర్శకుల సూచీ సంఖ్య : : 45
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil