ప్రధాన మంత్రి కార్యాలయం
అమరవీరుడు ఉధమ్ సింగ్‌నకు నివాళులు అర్పిస్తూ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
31 JUL 2026 9:12AM by PIB Hyderabad
విప్లవకారుడు ఉధమ్ సింగ్ బలిదాన దినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక నివాళి అర్పించారు. ఉధమ్ సింగ్ జీవితంలో నిండి ఉన్న సాహస, పరాక్రమాలు మాతృభూమి గౌరవాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పరిరక్షించడానికి దేశంలో ప్రతి తరానికీ స్ఫూర్తిని అందిస్తుంటాయని ప్రధానమంత్రి అన్నారు.
‘‘న జాతు శౌర్యం పురుషస్య భానురస్తం గతో భవతి కదాపి శశ్వత్, యథా పునస్తపతి దివాకరోయం తథా పునర్విక్రమతే స వీరః’’ అన్న ఓ సంస్కృత సుభాసితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
పరాక్రమమనే సూర్యుడు ఎప్పటికీ అస్తమించడు. సూర్యుడు మరుసటి రోజు మళ్లీ ఉదయించి పూర్తి తేజస్సుతో ప్రకాశిస్తున్నట్లుగానే, వీరులు తమ పరాక్రమంతో ప్రతికూలతపై విజయాన్ని సాధిస్తుంటారని ఈ సుభాషితం మనకు చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘మహా క్రాంతికారుడు షహీద్ ఉధమ్ సింగ్‌నకు ఆయన ప్రాణత్యాగ దినోత్సవం సందర్భంగా సాదర ప్రణామాలు. ధైర్య, పరాక్రమాలతో కూడిన ఆయన జీవిత కథ మాతృభూమి ఆత్మగౌరవాన్ని పరిరక్షించడానికి దేశంలో ప్రతి తరానికీ స్ఫూర్తిని అందిస్తుంది.
‘‘న జాతు శౌర్యం పురుషస్య భానురస్తం గతో భవతి కదాపి శశ్వత్, యథా పునస్తపతి దివాకరోయం తథా పునర్విక్రమతే స వీరః’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2292209)
సందర్శకుల సూచీ సంఖ్య : : 61
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam