హోం మంత్రిత్వ శాఖ
‘ప్రభుత్వ పరీక్షల్లో అక్రమ పద్దతుల నివారణ సవరణ బిల్లు-2026’కు లోక్‌సభలో ఆమోదం... విద్యార్థులకు కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా అభినందనలు
అత్యంత కఠిన నిబంధనలతో కొత్త చట్టం... యువత కలలు, ఆకాంక్షలకు పూర్తి రక్షణ
పరీక్షల పవిత్రతకు భంగం కలిగిస్తే సహించేది లేదు... నిందితులకు కఠినమైన శిక్షలు ఖాయం
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే ఉపేక్షించం... చట్టం పరిధిలో తీవ్ర చర్యలు ఉంటాయని మోదీ ప్రభుత్వం హెచ్చరిక
प्रविष्टि तिथि:
29 JUL 2026 6:00PM by PIB Hyderabad
ప్రభుత్వ పరీక్షల్లో అక్రమ పద్దతుల నివారణ సవరణ బిల్లు 2026 (పబ్లిక్ ఎగ్జామినేషన్స్-ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) లోక్‌సభలో ఆమోదం పొందడం పట్ల కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా దేశంలోని విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో అమిత్ షా ఇలా పేర్కొన్నారు. ‘‘నేడు లోక్‌సభలో ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026 ఆమోదం పొందిన సందర్భంగా భారత్‌లోని ప్రతీ విద్యార్థికి శుభాకాంక్షలు. పోటీ పరీక్షల పవిత్రతకు భంగం కలిగించే ధైర్యం చేసేవారికి అత్యంత కఠినమైన శిక్షలు విధించేలా పటిష్ట నిబంధనలను రూపొందించడం ద్వారా ఈ బిల్లు మన యువత కలలకు, ఆశయాలకు రక్షణగా నిలుస్తుంది. మన విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడానికి ప్రయత్నించే వారిని శ్రీ మోదీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టదు. అక్రమార్కులు చట్టం తీవ్రతను పూర్తిగా ఎదుర్కొనేలా ప్రభుత్వం అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటుంది’’.
***
(रिलीज़ आईडी: 2291511)
आगंतुक पटल : 17