రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మిషన్-మోడ్ నియామకాల ద్వారా శ్రామిక శక్తిని బలోపేతం చేస్తున్న భారతీయ రైల్వేలు 2014 నుంచి (జూన్ 2026 వరకు) 5.56 లక్షల నియామకాలు


దక్షిణ రైల్వేలో జరిగిన 50,485 నియామకాలూ దీనిలో భాగంగా ఉన్నాయి: శ్రీ అశ్వినీ వైష్ణవ్

2024 - 2025 పరీక్షా వ్యవధిలో కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరైన సుమారు 4.5 కోట్ల మంది అభ్యర్థులు

రైల్వే ఉద్యోగార్థులకు విస్తృతంగా అందుబాటులో ఉండేలా, అధిక సౌలభ్యాన్ని కల్పించేలా 15 భాషల్లో 150కి పైగా నగరాల్లో నియామక పరీక్షల నిర్వహణ

प्रविष्टि तिथि: 29 JUL 2026 4:11PM by PIB Hyderabad

2004-05 నుంచి 2013-14 వరకు, 2014-15 నుంచి 2025-26 వరకు భారతీయ రైల్వేలో జరిగిన నియామకాల వివరాలు కింది విధంగా ఉన్నాయి: -

 

వ్యవధి

నియామకాలు

2004-2005 to 2013-2014

4.11 లక్షలు

2014-2015 to 2026-2027 (30.06.2026 వరకు)

5.56 లక్షలు (దక్షిణ రైల్వే నియామకాలు 50,485 సహా)

 

భారతీయ రైల్వే పరిమాణం, భౌగోళిక విస్తరణ, కార్యకలాపాల క్లిష్టతను పరిగణనలోకి తీసుకుంటే... ఖాళీలు ఏర్పడటం, వాటిని భర్తీ చేయడం నిరంతర ప్రక్రియగా ఉంటుంది. సాధారణ కార్యకలాపాలు, సాంకేతిక మార్పులు, యాంత్రీకరణ, వినూత్న పద్ధతులకు అనుగుణంగా తగినంత, అనువైన మానవ వనరులను నియమిస్తుంటారు. కార్యాచరణ, సాంకేతిక అవసరాలకు అనుగుణంగా, నియామక సంస్థల ఇండెంట్లను జారీ చేయడం ద్వారా రైల్వేలు ప్రధానంగా ఖాళీలను భర్తీ చేస్తాయి.

ఆర్ఆర్‌బీ పరీక్షలు చాలా సాంకేతికమైనవి. వీటికి పెద్ద ఎత్తున సిబ్బందిని, వనరులను సమీకరించడం, ఆ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం అవసరం. రైల్వే ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి, నిర్దేశించిన మార్గదర్శకాలన్నింటినీ పాటిస్తూ పారదర్శకంగా నియామక ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది.

వ్యవస్థాపరమైన మెరుగుదలలో భాగంగా, గ్రూప్ ‘C’ పోస్టుల వివిధ విభాగాలకు నియామకాలు చేపట్టేందుకు 2024 నుంచి వార్షిక క్యాలెండర్‌ను ప్రచురించే విధానాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఈ వార్షిక క్యాలెండర్ విధానం అభ్యర్థులకు కింది విధంగా ప్రయోజనకరంగా ఉంది:

అభ్యర్థులకు మరిన్ని అవకాశాలు-

ప్రతి ఏటా అర్హత సాధించే వారికి అవకాశాలు

పరీక్షల నిర్వహణపై నిశ్చయత

వేగవంతమైన నియామక ప్రక్రియ, శిక్షణ, ఉద్యోగ నియామకాలు

2024, 2025, 2026 వార్షిక క్యాలెండర్ ప్రకారం, భారతీయ రైల్వేల్లో నాన్-గెజిటెడ్ సిబ్బందికి సంబంధించిన 1,61,889 ఖాళీల (దక్షిణ రైల్వేకు చెందిన 11,387 ఖాళీలతో సహా) భర్తీ ప్రక్రియను ప్రస్తుతం చేపట్టారు.

2024 జనవరి నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 92,116 ఖాళీల కోసం (దక్షిణ రైల్వేకు చెందిన 6,927 ఖాళీలతో సహా) పది కేంద్రీకృత ఉపాధి ప్రకటనలు (సీఈఎన్‌లు) జారీ చేశారు. ఈ ప్రకటనల్లో అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుళ్లు, జూనియర్ ఇంజనీర్లు/డిపో మెటీరియల్ సూపరింటెండెంట్/కెమికల్, మెటలర్జికల్ అసిస్టెంట్, పారామెడికల్ కేటగిరీలు, నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (గ్రాడ్యుయేట్), నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (అండర్-గ్రాడ్యుయేట్), మినిస్టీరియల్ - ఐసోలేటెడ్ కేటగిరీలు, అసిస్టెంట్లు, ట్రాక్ మెయింటెయినర్లు, పాయింట్స్‌మ్యాన్ వంటి లెవెల్-1 కేటగిరీల పోస్టులను భర్తీ చేశారు.

92,116 పోస్టులకు సంబంధించి మొదటి దశ/ఏకైక దశ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీలు) పూర్తయ్యాయి. వివరాలు కింది విధంగా ఉన్నాయి:-

ఏఎల్‌పీ, జేఈ/డీఎంఎస్/సీఎంఏ, నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (గ్రాడ్యుయేట్, అండర్-గ్రాడ్యుయేట్) పోస్టులకు సంబంధించిన 2వ దశ సీబీటీలు పూర్తయ్యాయి. వివరాలు కింది విధంగా ఉన్నాయి:

Exam

Candidates

Cities

Languages

2nd Stage CBT for the post of ALP (18,799 vacancies)

2,66,363

112

15

2nd Stage CBT for the post of JE/DMS/CMA (7,951 vacancies)

1,17,339

118

15

2nd Stage CBT for Non-Technical Popular Categories (Graduate) (8,113 vacancies)

1,21,931

129

15

2nd Stage CBT for Non-Technical Popular Categories (Under-Graduate) (3445 vacancies)

51,978

79

15

Total Candidates

5,57,611

 

 

 

ఏఎల్‌పి, నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (గ్రాడ్యుయేట్) పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (సిబిఎటి), నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్), మినిస్టీరియల్ - ఐసోలేటెడ్ కేటగిరీల పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత స్కిల్ టెస్టులూ పూర్తయ్యాయి. వివరాలు కింది విధంగా ఉన్నాయి:

2026-2027 సంవత్సరానికి (30.06.2026 వరకు) టెక్నీషియన్లు, జూనియర్ ఇంజనీర్లు, పారామెడికల్ కేటగిరీలు, మినిస్టీరియల్ - ఐసోలేటెడ్ కేటగిరీలు, అసిస్టెంట్ లోకో పైలట్‌ల పోస్టులతో సహా వివిధ పోస్టుల కోసం 3,300 మందికి పైగా అభ్యర్థుల ప్యానెల్‌లు ఖరారయ్యాయి. వీరిలో అధిక శాతం మంది భద్రతా కేటగిరీలకు చెందినవారే.

 

దీనికి అదనంగా, 2025 సంవత్సరపు వార్షిక క్యాలెండర్ ప్రకారం, 51,970 ఖాళీల కోసం (దక్షిణ రైల్వేకు చెందిన 3,412 ఖాళీలతో సహా) తొమ్మిది కేంద్రీకృత ఉపాధి నోటిఫికేషన్లు (సీఈఎన్‌లు) జారీ అయ్యాయి. వివరాలు కింది విధంగా ఉన్నాయి:-

29,775 పోస్టుల కోసం మొదటి దశ/ఏకైక దశ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీలు) పూర్తయ్యాయి. వివరాలు కింది విధంగా ఉన్నాయి:-

 

***

 


(रिलीज़ आईडी: 2291305) आगंतुक पटल : 45
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Gujarati , Malayalam