హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్ఎఫ్ఐఈఎస్‌కు నిధులు ఆంధ్రప్రదేశ్‌లో సీఎఫ్ఎస్ఎల్ ఏర్పాటు ప్రతిపాదన లేదు

प्रविष्टि तिथि: 28 JUL 2026 3:26PM by PIB Hyderabad

జాతీయ ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల పెంపు పథకం (ఎన్ఎఫ్ఐఈఎస్)ను 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 వరకు మొత్తం రూ.2254.43 కోట్ల వ్యయంతో భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం ద్వారా 09 నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్‌యూ) క్యాంపస్‌ల ఏర్పాటుకు రూ.1309.13 కోట్లు... 07 సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీస్ (సీఎఫ్ఎస్ఎల్)ల ఏర్పాటుకు రూ.860.3 కోట్లను కేటాయించింది. ఎన్ఎఫ్ఎస్‌యూ క్యాంపస్‌లు, సీఎఫ్ఎస్ఎల్‌ల పథకం ద్వారా రూ.119.09 కోట్ల నిధులను విడుదల చేయగా... వాటిని వినియోగించారు. గుర్తించిన ప్రాంతాల్లో ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటానికి, పటిష్ఠం చేయటానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఈ పథకం ద్వారా నాగ్‌పూర్ (మహారాష్ట్ర), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), ఖోర్దా (ఒడిశా), చంగల్‌పట్టు (తమిళనాడు), రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో 09 నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్‌యూ) క్యాంపస్‌ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), ఖోర్దా (ఒడిశా), చంగల్‌పట్టు (తమిళనాడు), రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, కేరళలో 07 సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీల (సీఎఫ్ఎస్ఎల్‌ల) ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని 06 సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలు (సీఎఫ్ఎస్ఎల్), నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్‌యూ) క్యాంపస్‌లతో కలిపి ఒకేచోట ఏర్పాటు చేయనున్నారు. నాగ్‌పూర్ (మహారాష్ట్ర), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), ఖోర్దా (ఒడిశా), చంగల్‌పట్టు (తమిళనాడు), వారణాసి (ఉత్తరప్రదేశ్)లో ఎన్ఎఫ్ఎస్‌యూ క్యాంపస్, సీఎఫ్ఎస్ఎల్ కోసం ఇప్పటికే భూ కేటాయింపులు జరిగాయి.

నాగ్‌పూర్ (మహారాష్ట్ర), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), ఖోర్దా (ఒడిశా), చంగల్‌పట్టు (తమిళనాడు), జైపూర్ (రాజస్థాన్)కు కేటాయించిన ఎన్ఎఫ్ఎస్‌యూ క్యాంపస్‌లు ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సీఎఫ్ఎస్ఎల్‌ని ఏర్పాటు చేసే ప్రతిపాదనేమీ లేదు.

ఈ సమాచారాన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ లిఖితపూర్వకంగా లోక్‌సభకు అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2290837) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी