ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల వసూలు కాని స్థూల రుణాలు (జీఎన్‌పీఏ) 2025-26 ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువగా 1.9 శాతానికి పరిమితం

ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఈ బ్యాంకులకు రూ.1.98 లక్షల కోట్ల నికర లాభం..

రూ.283 లక్షల కోట్లకు పైబడిన మొత్తం వ్యాపారం

2025-26 ఆర్థిక సంవత్సరంలో కీలక రంగాలకిచ్చిన రుణాల్లో గణనీయ వృద్ధి.. ఎమ్ఎస్ఎమ్ఈలకిచ్చిన రుణాల్లో 19.6 శాతం, రిటైల్ లోన్లలో 19.8 శాతం పెరుగుదల

प्रविष्टि तिथि: 28 JUL 2026 3:27PM by PIB Hyderabad

ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీస్) ఆర్థిక స్థితి చెప్పుకోదగిన స్థాయిలో పుంజుకుంది. ఆస్తి అప్పుల పట్టీలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఇదివరకు ఎప్పుడూ ఎరుగని విధంగా అధిక లాభాలను పీఎస్‌బీలు నమోదు చేశాయి. వసూలు కాని స్థూల రుణాలు (జీఎన్‌పీఏ) అనేక దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయికి పరిమితం కావడం కూడా మరో విశేషం.
గత అయిదు సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పనితీరుకు సంబంధించిన కొలమానాలు, వసూలు కాని రుణాల్లో తగ్గుదల వివరాలు ఇలా ఉన్నాయి:

  (రూ. లక్షల కోట్లలో)  

  ఆర్థిక కొలమానాలు  

31.3.2022

31.3.2023

31.3.2024

31.3.2025

31.3.2026

మొత్తం వ్యాపారం

181.5

203.2

226.7

251.7

283.3

మొత్తం డిపాజిట్లు

107.2

117.1

129.0

142.0

156.3

మొత్తం రుణాలు, అడ్వాన్సులు  

74.3

86.1

97.7

109.8

127.0

నికర లాభం

0.67

1.05

1.41

1.78

1.98

స్థూల ఎన్‌పీఏలు (%)

7.3

5.0

3.5

2.6

1.9

క్యాపిటల్ అడెక్వసీ - సీఆర్ఏఆర్ (%)

14.6

15.5

15.6

16.1

16.6

(మూలం: భారతీయ రిజర్వు బ్యాంకు)

 

వీటికి తోడు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు చెందిన వివిధ రంగాలకు రుణాలను ఇవ్వడంలో నిరంతర  వృద్ధిని నమోదు చేశాయి. రిటైల్, వ్యవసాయ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థ (ఎమ్ఎస్ఎమ్‌ఈ)లు, మౌలిక సదుపాయాల కల్పన విభాగాల్లో రంగం వారీ రుణ మంజూరులో చోటు చేసుకున్న పురోగతి ఈ కింది విధంగా ఉంది:  

(ఏటికేడాది వృద్ధి శాతంలో) 

రుణాల్లో వృద్ధి

31.3.2022

31.3.2023

31.3.2024

31.3.2025

31.3.2026

రిటైల్ రుణాలు

12.9

20.2

12.6

17.7

19.8

వ్యవసాయ, వ్యవసాయ అనుబంధిత 

కార్యకలాపాల సంబంధిత రుణాలు

6.7

18.8

16.9

9.8

16.2

ఎమ్ఎస్ఎమ్ఈ రుణాలు  

-1.7

9.0

11.0

9.8

19.6

మౌలిక సదుపాయాల రంగ రుణాలు*

-14.7

33.7

5.9

2.2

4.9

(మూలం: భారతీయ రిజర్వు బ్యాంకు)

*Pertaining to Industries Sector Only

(*పారిశ్రామిక రంగానికి సంబంధించినవి మాత్రమే)


పశ్చిమ ఆసియాలో సంఘర్షణల నేపథ్యంలో వాణిజ్య సంస్థలు ఎదుర్కొంటున్న స్వల్పకాలిక నగదు సంబంధిత సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం 2026 మే నెలలో అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీము.. ఈసీఎల్‌జీఎస్ 5.0) తీసుకువచ్చింది. ఈ పథకం అర్హత కలిగిన రుణగ్రహీతలకు ఇచ్చిన అదనపు రుణ సదుపాయంలో భాగంగా డిఫాల్ట్ రాశి కోసం నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్‌సీజీటీసీ) ద్వారా మెంబర్ లెండింగ్ సంస్థల (ఎమ్ఎల్ఐస్)కు పూచీకత్తును సమకూరుస్తుంది. ఈ పథకం ఎమ్ఎస్ఎమ్‌ఈస్‌కు 100 శాతం, ఎమ్ఎస్ఎమ్ఈలు కాని, ప్రయాణికుల్ని చేరవేసే విమాన సంస్థల రంగానికి 90 శాతం పూచీకత్తును అందిస్తుంది. ఇది రూ.2,55,000 కోట్ల వరకు రుణాలుగా ఇవ్వడానికి ఉద్దేశించింది. దీనిలో రూ.5,000 కోట్లను ప్రత్యేకించి ప్రయాణికుల్ని చేరవేసే విమాన సంస్థల రంగానికే నిర్దేశించారు.
ఈసీఎల్‌జీఎస్ 5.0లో భాగంగా, విమానసంస్థ రంగంలో రుణగ్రహీతలు 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో, అంటే 2026 జనవరి 1 మొదలు 2026 మార్చి 31 మధ్య (ఈ రెండు తేదీలతో సహా) తమ మొత్తంమీది గరిష్ఠ రుణ బకాయిల్లో (నిధి ఆధారితమైనవాటితో పాటు నిధి ఆధారితం కానివి కూడా కలిపి) 100 శాతం వరకూ సహాయాన్ని అందుకోవడానికి అర్హతను కలిగి ఉంటాయి. ఈసీఎల్‌జీఎస్ 5.0లో భాగంగా విమానసంస్థల రంగానికి అందుబాటులో ఉన్న గరిష్ఠ రుణ రాశి ప్రతి రుణగ్రహీతకూ రూ.1,500 కోట్లుగా ఉంటుంది. (దీనిలో, రూ.1,000 కోట్లకు మించిన మొత్తం గాని, అలాగే రూ.1,500 కోట్ల లోపు వరకూ ఏ మొత్తాన్ని అయినా గాని ప్రమోటర్లు, యాజమాన్యాల నుంచి దామాషా పద్ధతిలో అందే ఈక్విటీ రాశిని కలుపుకొని మాత్రమే అనుమతిని ఇస్తారు).
ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌధరీ  రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ రోజు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియజేశారు.
 
***

(रिलीज़ आईडी: 2290831) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Bengali , English , Urdu , हिन्दी