పార్లమెంటరీ వ్యవహారాలు
azadi ka amrit mahotsav

జాతీయ ఈ-విధాన్ అమలు… 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో... 33 అంగీకారం

प्रविष्टि तिथि: 27 JUL 2026 3:49PM by PIB Hyderabad

37 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల విధాన సభలకు గాను 33 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల విధాన సభలు జాతీయ ఈ-విధాన్ అప్లికేషన్ (ఎన్ఈవీఏఅమలుకు సంబంధించిన అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయివీటిలో 21 విధాన సభలను ‘నేవా’ ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ విధాన సభలుగా తీర్చిదిద్దారుపార్లమెంటు ఉభయ సభల డిజిటలీకరణ మాత్రం ఎన్ఈవీఏ ప్రాజెక్టు పరిధికి వెలుపల ఉంది.
సభ కార్యకలాపాలను ఎలక్ట్రానిక్ ప్రాసెసింగుకు అనువైనవిగా మార్చడం ద్వారా సభ నిర్వహణ సామర్థ్యాన్ని ‘నేవా’ మెరుగుపరిచిందిఇది కాగిత ఆధారిత ప్రక్రియలపైన ఆధారపడడాన్ని తగ్గించిందిదీంతో విధాన సభల కార్యకలాపాలను త్వరితగతిన ప్రాసెస్ చేయడంప్రసారం చేయడం సులభతరంగా మారిందివిధాన సభలు సమాచారాన్ని అందజేసే తీరు కూడా సరళతరమైందిఫలితంగా డాక్యుమెంట్ల ముద్రణనిర్వహణతో పాటు వాటిని భద్రపరిచి ఉంచడానికి పెట్టే ఖర్చు మిగిలింది.
నేవా ప్రాజెక్టు పనితీరును నీతి ఆయోగ్ పరిశీలించిందినేవాకాగితాల వాడకాన్ని తగ్గించిందనీవిధానసభల కార్యకలాపాలను సుగమం చేసిందనీ పేర్కొన్నారుచట్ట సభలుప్రభుత్వ విభాగాలకు మధ్య మెరుగైన సమన్వయంతో విధాన సభల పనితీరు వేగవంతమైందివాస్తవిక సమయంలో విధాన సభల డాక్యుమెంట్ల తక్షణ లభ్యతకు నేవా సార్వజనిక పోర్టల్ వీలు కల్పిస్తుందిసేవాకేంద్రాలను ఏర్పాటు చేయడం సహా సామర్థ్యాన్ని పెంచే దిశగా నేవా చేపట్టిన కార్యక్రమాలు ఆసక్తిదారులకు సాంకేతిక సహాయాన్నీశిక్షణనీ అందించి ఈ ప్లాట్‌ఫారాన్ని అనుసరించడంలో సాయపడ్డాయని కూడా నివేదికలో తెలిపారు.
ఉపయోగించుకొనే వారి స్పందననిర్వహణ సంబంధిత అవసరాల ఆధారంగా నేవా అప్లికేషనుకు ఎప్పటికప్పుడు మరిన్ని మెరుగులు దిద్దుతుంటారు.
సైబర్ భద్రతను పెంచడానికి నేవా అప్లికేషనును సురక్షిత ఎన్ఐసీ మేఘ్‌రాజ్ 2.0 క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి మార్చారుభాషిణితో కలపడంతోసార్వజనిక పోర్టల్ కంటెంటును పాఠం వారీగా (టెక్స్‌ట్-టు-టెక్స్‌ట్అనువదించడం సాధ్యం అయిందిదీంతో భాషాపరమైన సౌలభ్యమూ మెరుగుపడిందిఅన్ని ఉపకరణాలపైనా నిర్వహించడానికి వీలు ఉండేటట్లు చూడటానికి ఈ అప్లికేషనును డివైస్-ఇండిపెండెంట్ ప్లాట్‌ఫామ్ మాదిరిగా రూపొందించారుభూమిక ఆధారిత డాష్‌బోర్డులువిధాన సభ డాక్యుమెంట్లకు వర్క్‌ఫ్లో ఆధారిత ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ వంటివి సభ్యులువిధాన సభల సచివాలయాలతో పాటు ప్రభుత్వ విభాగాల వంటి వివిధ వినియోగదారుల మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తాయి.
ఈ సమాచారాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్మురుగన్ రాజ్యసభకు ఈ రోజు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.

 

***


(रिलीज़ आईडी: 2290208) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , हिन्दी , Kannada , Urdu , Bengali , Bengali-TR , Gujarati , Tamil