ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సరిహద్దు గ్రామాల అభివృద్ధి (వికసిత్ వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్) 2026 భాగస్వాములతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


యువతలో దేశ నిర్మాణం పట్ల మరింత లోతైన బాధ్యతాభావాన్ని ఈ కార్యక్రమం పెంపొందించడం ఎంతో సంతోషకరం: ప్రధానమంత్రి

వికసిత గ్రామాలే వికసిత భారత్ కు పునాది: ప్రధాని మోదీ

సరిహద్దు గ్రామాలను దేశానికి చివరి గ్రామాలుగా కాకుండా వాటికి మొదటి గ్రామాలుగా ప్రాధాన్యం ఇస్తున్నాం: ప్రధానమంత్రి

సరిహద్దు గ్రామాల అభివృద్ధి ప్రయాణం ప్రతి ఒక్కరినీ అనుసంధానించడానికి, అందరితో మమేకమవ్వడానికి సరళమైన సాధనం: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 26 JUL 2026 7:35PM by PIB Hyderabad

సరిహద్దు గ్రామాలను మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పరచే ‘వికసిత వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2026’ భాగస్వాములతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ముఖాముఖీ ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా లభించిన అద్భుతమైన స్పందనను, భాగస్వామ్యాన్ని కొనియాడిన ఆయనదేశంలోని దాదాపు 250 జిల్లాల నుంచి విచ్చేసిన ఉత్సాహవంతులైన యువ భాగస్వాములకు ఆత్మీయ స్వాగతం పలికారు.

 

కొద్ది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన  ' మేరా యువ భారత్ - మై భారత్' వేదిక నేడు కోట్లాది మంది యువతను చేర్చుకుంటూ విస్తరించడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ యువజన నెట్‌వర్క్ చేపడుతున్న క్రియాశీలక సేవలను అభినందిస్తూ, 'వికసిత భారత్ డైలాగ్' నుంచి 'వికసిత వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్' వరకు వివిధ కార్యక్రమాల్లో యువత చూపుతున్న విశేష సామర్థ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. “నేడు ‘మై భారత్’ యువ మిత్రులు దేశవ్యాప్తంగా అత్యంత ప్రశంసనీయమైన సేవలను అందిస్తున్నారు” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

వికసిత భారత్ యువ నేతల సమావేశం సమయంలో ఈ క్షేత్రస్థాయి కార్యక్రమానికి పడిన పునాదిని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. యువత కేవలం వర్చువల్  సంభాషణలకే పరిమితం కాకుండా, దేశ వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవాలనేది తన ఆకాంక్ష అని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్ సరిహద్దు గ్రామాలకు యువతను పంపడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని ఆయన వివరిస్తూ, మూడు లక్షల మంది భాగస్వాముల నుంచి ఎంపిక చేసిన 400 మందికి పైగా యువతను అక్కడి స్థానిక సంస్కృతుల్లో మమేకమవ్వడానికి, ఆ ప్రాంతాల్లోని ప్రజల బలమైన దేశభక్తి ఆకాంక్షలను ప్రత్యక్షంగా తెలుసుకోడానికి పంపినట్లు వెల్లడించారు. "మీ సంస్కృతిని అక్కడి సంస్కృతితో అనుసంధానించడమే 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్'కు అత్యుత్తమ ఉదాహరణ" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

ప్రభుత్వ బాధ్యతలు చేపట్టడానికి ముందే విస్తృత పర్యటనల ద్వారా సరిహద్దు సమాజాలతో తమకు ఏర్పడిన ప్రగాఢమైన వ్యక్తిగత సంబంధాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకోవడం తనకు ఆనవాయితీగా వస్తోందని ఈ సందర్భంగా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

 

తన వ్యక్తిగత అనుభవాలను సరిహద్దు పర్యటనల నుంచి తిరిగి వచ్చిన యువత పంచుకున్న ఉత్సాహభరితమైన అనుభూతులతో ఆయన పోల్చారు. సరిహద్దుల్లోని స్థానిక ప్రజల అపారమైన ఆప్యాయత నుంచి సాయుధ బలగాల అసమాన ధైర్యసాహసాల వరకు యువత ప్రత్యక్షంగా చూసిన విశేషాలను ప్రస్తావించారు. 'కార్గిల్ విజయ్ దివస్' సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల అత్యున్నత త్యాగాలకు ప్రధాని నివాళులర్పించారు. "అత్యంత సవాలుతో కూడిన పరిస్థితుల్లో కూడా ఆ వీర జవాన్లు విజేతగా త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. ఈ 'వికసిత వైబ్రంట్ విలేజ్' మొత్తం అనుభవం నిజంగా ఎంతో అద్భుతమైనది" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

వికసిత గ్రామాలను ‘వికసిత భారత్’ నిర్మాణానికి అత్యంత కీలకమైన పునాది రాళ్లుగా అభివర్ణించిన ప్రధానమంత్రి, ఈ మార్పుదాయక ప్రయాణ నిరంతర, విస్తృత స్వభావాన్ని ప్రత్యేకంగా ఉద్ఘాటించారు యువతరానికి లభించే ఈ క్షేత్రస్థాయి భాగస్వామ్యం జాతీయ దృష్టికోణాన్ని విస్తరించడమే కాకుండా, దేశాభివృద్ధిలో తమవంతు అర్ధవంతమైన సహకారాన్ని అందించాలనే వారి వ్యక్తిగత సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ అనుసంధానం ప్రాముఖ్యతను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు "దేశ యువత క్షేత్రస్థాయి పరిశీలనతో మమేకమైనప్పుడు, అది 'వికసిత భారత్' సుదూర దృష్టికోణాన్ని మరింత విస్తృతం చేస్తుంది" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు

 

సరిహద్దు ప్రాంతాల్లోని కఠినమైన జీవన పరిస్థితులను ప్రస్తావిస్తూ, అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి క్షణం దేశభక్తిని శ్వాసిస్తూ జీవిస్తున్న స్థానిక ప్రజలను శ్రీ మోదీ ప్రశంసించారు. గతంలో రోడ్లు, విద్యుత్, ఆసుపత్రులు వంటి కనీస ప్రాథమిక వసతులు కూడా లేకుండా ఈ ప్రాంతాలను 'చివరి గ్రామాలు'గా పరిగణించి నిర్లక్ష్యం చేశారని, అయినప్పటికీ అక్కడ నివసించే ప్రజలు కాపాడుకుంటూ వస్తున్న చెక్కుచెదరని జాతీయ భావం, దేశభక్తి ప్రశంసనీయమని ప్రధాని పేర్కొన్నారు. అంతటి అత్యంత దుర్భర, వసతుల లేమి పరిస్థితుల్లో కూడా సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఎన్నడూ సడలని దేశభక్తికి మనం ఎంతగానో గర్వపడాలి" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

ప్రభుత్వ వ్యూహాత్మక విధానంలో వచ్చిన  విప్లవాత్మక మార్పును వివరిస్తూ, సరిహద్దు నివాసాలను భారతదేశ 'చివరి' గ్రామాల నుంచి ఉదయ తొలి కిరణాలుమువ్వన్నెల జెండా దేశానికి మొదటగా స్వాగతం పలికే 'తొలి గ్రామాలుగా' అధికారికంగా పునర్నామకరణం చేయడాన్ని ప్రధాని ప్రముఖంగా పేర్కొన్నారు.

 

స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతాల్లో విద్యుత్, రహదారులు, తాగునీటి కుళాయిలు, గ్యాస్ కనెక్షన్లు, ఇంటర్నెట్ సదుపాయాలు వంటి అనేక చారిత్రక మౌలిక సదుపాయాల పురోగతిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రాథమిక పట్టణ సదుపాయాలు సరిహద్దు వాసుల వ్యవసాయ రంగాన్ని, వారి దైనందిన జీవితాలను మౌలికంగా ఎలా మార్చివేస్తున్నాయో ఆయన వివరించారు.  “నాటి చారిత్రక ఆలోచనా ధోరణిని మార్చడం వల్లనే రోజు మన సరిహద్దు ప్రాంతం వేగంగా మార్పు చెందుతోంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

కొత్తగా ఏర్పాటైన మౌలిక సదుపాయాల వల్ల లభించే అనేక ఆర్థిక ప్రయోజనాలను వివరిస్తూ, సరిహద్దు ప్రాంత పర్యాటకంలో వచ్చిన భారీ పునరుజ్జీవనాన్ని ప్రధాని ప్రముఖంగా పేర్కొన్నారు. ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉన్న గ్రామాలు ఇప్పుడు నిరంతర కార్యకలాపాలతో కళకళలాడుతున్నాయని, ఇవి ఆడపిల్లల విద్యకుస్థానికంగా ఆదాయం పెంపునకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ మార్పులన్నీ 'వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్' ద్వారా క్రమబద్ధంగా వేగవంతం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. "'వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ సరిహద్దు గ్రామాల సమగ్ర అభివృద్ధికి చురుగ్గా అద్భుతమైన కొత్త వేగాన్ని ఇస్తోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

సరిహద్దు పర్యటనల భాగస్వామ్యం ద్వారా ఏర్పడే ఐక్యతను భావోద్వేగ ప్రయాణంగా అభివర్ణిస్తూ, తిరిగి వచ్చిన యువత కేవలం వారి ఆతిథ్యాన్ని మాత్రమే కాకుండా సాంస్కృతిక అవగాహనను, ఎంతో సంతృప్తినిగొప్ప గౌరవాన్ని పొందిందని ప్రధాని గుర్తుచేశారు. ఇటువంటి అమూల్యమైన క్షేత్ర స్థాయి అనుభవాలు తరగతి గదిలో ఎప్పటికీ లభించవని స్పష్టం చేస్తూ, ఈ ప్రాంతాలను సందర్శించేలా తమ తోటి వారిని కూడా ప్రోత్సహించాలని ఆయన భాగస్వాములను కోరారు. ఇది క్రమంగా ఆయా ప్రాంతాలకు ఆధునిక వసతుల లభ్యతను వేగవంతం చేస్తుందని చెప్పారు. "'భారతీయ యువత సరిహద్దు గ్రామాలను ఎంత లోతుగా అర్థం చేసుకుంటే, మన దేశం అంతగా బలోపేతం అవుతుంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు."

 

సరిహద్దు పర్యాటకానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను మరింత ముందుకు తీసుకెళ్లాలని యువతకు పిలుపునిస్తూ, ప్రతి భాగస్వామీ తమ అనుభవాలను కనీసం వంద మంది తోటివారితో పంచుకోవాలని కోరారు. ప్రాంతీయ సంస్కృతి, ఉత్పత్తులను ప్రోత్సహించడానికి స్థానిక కంటెంట్ క్రియేటర్లతో కలసి పనిచేయాలని, ప్రామాణికమైన ఇంటర్నెట్ కంటెంట్‌ను పంచుకోవాలని, భవిష్యత్తులో కుటుంబాలతో కూడా కలసి వెళ్లాలనితమ తమ విద్యాసంస్థల ద్వారా విద్యా యాత్రలను   ప్రోత్సహించాలని ప్రధాని సూచించారు. "మీలోని ప్రతి యువ మిత్రుడు మీ అనుభవాలను కనీసం మరో వంద మంది యువకులతో కచ్చితంగా పంచుకోవాలని నేను గట్టిగా కోరుతున్నాను" అని శ్రీ మోదీ అన్నారు

 

యువత సామర్థ్యంపై ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, 21వ శతాబ్దపు ప్రపంచ రూపురేఖలను తీర్చిదిద్దే అసలైన భవిష్యత్తు భారత యువత చేతుల్లోనే ఉందని ప్రధాని స్పష్టం చేశారు. యువతను పూర్తి వికసిత భారత్ చోదక శక్తిగానూ, అంతిమ లబ్ధిదారులుగానూ గుర్తిస్తూ, దేశ కీలక సవాళ్ల పరిష్కారాలతో వారు ప్రత్యక్షంగా మమేకం కావడం ద్వారా ఉజ్వలమైన జాతీయ భవిష్యత్తు సాధ్యమవుతుందని చెప్పారు. "మన యువశక్తి దేశ సవాళ్లు, పరిష్కారాలతో నేరుగా అనుసంధానమైనప్పుడు, భవిష్యత్తు కచ్చితంగా, నిశ్చయంగా ప్రకాశవంతంగా .ఉంటుంది' అని శ్రీ మోదీ స్పష్టం చేశారు

 

***


(रिलीज़ आईडी: 2289753) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Kannada , Khasi , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Tamil , Malayalam