ప్రధాన మంత్రి కార్యాలయం
యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్... హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
प्रविष्टि तिथि:
25 JUL 2026 7:05PM by PIB Hyderabad
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం సారనాథ్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమైన క్షణమని పేర్కొన్నారు.
సారనాథ్‌కు గౌతమ బుద్ధుడితో అత్యంత ప్రాచీనమైన, ప్రత్యేకమైన అనుబంధం ఉందని ప్రధాని గుర్తుచేశారు. గౌతమ బుద్ధుడు అందించిన జ్ఞానం, కరుణ, సామరస్యం అనే శాశ్వత సందేశాలు నేటికీ ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు.
యునెస్కో అందించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు భారతదేశపు లోతైన సంస్కృతికి, ఆధ్యాత్మిక వైభవానికి దక్కిన గొప్ప గౌరవమని కొనియాడారు. ఈ గుర్తింపు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరింత మంది ప్రజలు సారనాథ్‌ను సందర్శిస్తారని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బుద్ధుడి దివ్య సిద్ధాంతాలతో, ఆదర్శాలతో అనేకమంది మమేకం అవుతారని అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ప్రతి భారతీయుడికీ ఇది గర్వకారణమైన క్షణం!
ఉత్తరప్రదేశ్‌లోని సారనాథ్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరడం ఎంతో సంతోషకరం.
సారనాథ్‌కు బుద్ధ భగవానుడితో సన్నిహిత సంబంధం ఉంది. ఆయన అందించిన జ్ఞానం, కరుణ, సామరస్యం అనే శాశ్వత సందేశం ప్రపంచానికి స్ఫూర్తినిస్తుంది.
ఈ గుర్తింపు భారతదేశపు ప్రగాఢమైన నాగరిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని చాటి చెబుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మరింత మంది ప్రజలను సారనాథ్‌కు వచ్చి, బుద్ధ భగవానుడి ఆదర్శాలతో మమేకం కావడానికి ప్రేరేపిస్తుంది’’.
***
(रिलीज़ आईडी: 2289444)
आगंतुक पटल : 38
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam